News September 11, 2025

HYD: రూ.25 లక్షలతో ఓలా డ్రైవర్ పరార్

image

HYD బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓలా కార్ డ్రైవర్ రూ.25 లక్షల నగదుతో పరారయ్యాడని పోలీసులు తెలిపారు. సిటీ యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు సికింద్రాబాద్ నుంచి బాలానగర్ బ్రాంచ్‌కు డబ్బులు తీసుకొస్తున్నారని, మ.2 గంటల సమయంలో బ్యాంక్ సిబ్బంది కారులో నుంచి దిగిన వెంటనే డ్రైవర్ పెట్టెతో ఉడాయించాడన్నారు. బ్యాంక్ ఉద్యోగుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 14, 2025

విశాఖ సెంట్రల్ జైలు ఖైదీలకు భగవద్గీత బోధన

image

విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలకు మానసిక రుగ్మతలను జయించేందుకు, ప్రశాంతమైన జీవితాన్ని జీవించేందుకు భగవద్గీతను బోధించారు. భగవద్గీత మానవాళి జీవితానికి దిశా నిర్దేశంగా ఉంటుందని ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. భగవద్గీతను అనుసరిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

News December 14, 2025

దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే: ఖర్గే

image

ఓట్ చోరీకి పాల్పడే వారు ద్రోహులని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైరయ్యారు. ఓటు హక్కు, రాజ్యాంగాన్ని కాపాడాలంటే BJPని అధికారం నుంచి దింపేయాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ భావజాలాన్ని బలోపేతం చేయడం భారతీయుల బాధ్యత. దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. RSS ఐడియాలజీ దేశాన్ని నాశనం చేస్తుంది’ అని ఆరోపించారు. తన కొడుక్కు ఆపరేషన్ ఉన్నా వెళ్లలేదని, 140 కోట్ల మందిని కాపాడటమే ముఖ్యమని ర్యాలీకి వచ్చానని తెలిపారు.

News December 14, 2025

MDK: 2 ఓట్లతో స్వప్న విజయం

image

నిజాంపేట మండలం నందిగామలో బీజేపీ మద్దతుదారు షేరి స్వప్న 2 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. గ్రామంలో వారి మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుపోతామని వారు పేర్కొన్నారు. నమ్మకంతో గెలిపించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.