News March 27, 2024
HYD: రూ.2,57,05,390 నగదు పట్టివేత

HYDలో ఎన్నికల ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా ఇప్పటివరకు రూ.2,57,05,390 నగదు, రూ.37,05,841 విలువైన ఇతర వస్తువులు, 1386.28 లీటర్ల అక్రమ మద్యంను సీజ్ చేసినట్లు GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.16,19,000 నగదు, 1,81,689 విలువ గల ఇతర వస్తువులు, 49.37 లీటర్ల అక్రమ మద్యం పట్టుబడిందని వెల్లడించారు
Similar News
News February 19, 2026
సర్కార్‌కు షాక్.. GHMC 3 ముక్కలాటపై హైకోర్టు సీరియస్..!

HYDను 3ముక్కలు చేస్తూ సర్కార్ తెచ్చిన GOపై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. 2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్రం ఫ్రీజ్ విధించినా రూల్స్‌కు విరుద్ధంగా GHMC విభజన నిర్ణయం తీసుకున్నారని గురువారెడ్డి పిల్ వేశారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ 3వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో విభజన ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి.
News February 19, 2026
ఈస్ట్ HYDకు ‘కిక్’.. రూ.25 కోట్లతో భారీ స్పోర్ట్స్ కాంప్లెక్స్..!

నగర తూర్పు దిక్కున ఇక ఆటల జాతర షురూ కాబోతోంది. ఉప్పల్, శివారు ప్రాంతాల రూపురేఖలు మార్చేలా 10ఎకరాల విస్తీర్ణంలో రూ.25కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్‌తో పాటు అంతర్జాతీయ స్థాయి వసతులూ రానున్నాయి. ఈ ప్రాజెక్టుతో ఈస్ట్ HYD స్పోర్ట్స్ హబ్‌గా మారడమే కాకుండా, స్థానిక రియల్ ఎస్టేట్‌కు మంచి బూస్ట్ లభించనుంది.
News February 19, 2026
నార్సింగి: దారుణం.. గంజాయి తాగించి బాలికపై గ్యాంగ్ రేప్

నార్సింగి PS పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికకు ముగ్గురు రౌడీషీటర్లు బలవంతంగా గంజాయి తాగించారు. ఆపై మత్తులో తనపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితులు ముగ్గురూ ప్రస్తుతం పరారీలో ఉండగా.. పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిది నెక్నంపూర్ డివిజన్ పాషా కాలనీ అని సమాచారం.


