News August 23, 2025

HYD: రూ.3 వేలకే ఫోన్ అంటూ రీల్స్.. జర జాగ్రత్త!

image

సోషల్ మీడియా వినియోగం పెరగడంతో వ్యాపార ప్రకటనలకు ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ వేదికలుగా మారాయి. రూ.3 వేలకే మొబైల్, రూ.10కే ఇంటర్నేషనల్ బ్రాండ్ టీషర్ట్, రూ.12 వేలకే LCD TVఅంటూ చేసే రీల్స్ చూసి గుడ్డిగా నమ్మొద్దని HYDపోలీసులు సూచిస్తున్నారు. నగరంలో కొందరు యువత ఆ యాడ్స్‌ను నమ్మి వాటిని కొనుగోలు చేసిన తర్వాత మోసపోయామంటూ పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారన్నారు. జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

Similar News

News January 20, 2026

ఎల్బీనగర్ మెట్రోలో GOOD ‘మెసేజ్’

image

ఎప్పుడూ బిజీగా ఉండే మెట్రోలో మంగళవారం ఓ వింత దృశ్యం కనిపించింది. ఎల్బీనగర్ వెళ్లే రైలులో ఎవరో ఒక ‘జెన్-జీ’ కుర్రాడో, అమ్మాయో అతికించిన గ్రీన్ స్టిక్కీ నోట్స్ ప్రయాణికుల మనసు గెలుచుకుంటున్నాయి. “ప్రతిఫలం ఆశించకుండా సాయం చెయ్.. నీ మనసు చెప్పిందే విను” అంటూ డయానా చెప్పిన మంచి మాటలను ఆ నోట్స్‌పై రాశారు. యాంత్రికమైన ఈ కాలంలో నలుగురికి మంచిని పంచాలనే ఈ చిన్న ప్రయత్నం ప్రయాణికుల్లో నవ్వులు పూయించింది.

News January 20, 2026

‘జారుతున్న బతుకులు’.. గౌడన్నల గోసపై ప్రత్యేక కథనం

image

తిర్యాణి మండలంలో సుమారు 500 గౌడ కుటుంబాలు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. మండలంలో కొన్ని ప్రాంతాలు ఏజెన్సీలో ఉండడంతో ఇక్కడ జీవిస్తున్న గీత కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదు. ఎత్తయిన తాడి చెట్ల నుంచి జారుతూ పిట్టలా రాలిపోతున్నా తమను పట్టించుకునే వారే లేరని గౌడ కుటుంబాలు వాపోతున్నాయి. ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గౌడ కులస్థులను ఆదుకోవాలని గీత కార్మికులు కోరుతున్నారు.

News January 20, 2026

జోగి సోదరులకు బెయిల్

image

AP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముకు బెయిల్ మంజూరైంది. భవానీపురంలో నమోదైన కేసులో బెయిల్ లభించగా, మొలకలచెరువు కేసులో ఆయన రిమాండ్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.