News July 7, 2024
HYD: రూ.96 కోట్లతో 132 ఎకరాల్లో HMDA లేఅవుట్!
HYD శివారులో రూ.96 కోట్లతో లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు HMDA కసరత్తు మొదలుపెట్టింది. ఘట్‌కేసర్ మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలో ఒకే చోట 132 ఎకరాలను భూ యజమానులు HMDAకు అప్పగించారు. భూమిని స్వాధీనం చేసుకున్న HMDA అధికారులు సర్వే పూర్తి చేసి లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పనులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు.
Similar News
News December 11, 2024
HYD: ‘మళ్లీ మళ్లీ ఢిల్లీ.. ఇదే రేవంత్ లొల్లి’
HYD నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లటంపై ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ‘మళ్లీ మళ్లీ ఢిల్లీ.. ఇదే రేవంత్ లొల్లి. గల్లీలో అధికారం, ఢిల్లీలో బేరసారం. ప్రజలు వరదల్లో ఉన్నా, నిరుద్యోగులు రోడ్డెక్కినా, విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రులపాలైనా, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. పదవులు నిలుపుకోవడానికి, కార్పొరేషన్ కమిషన్లకు ఢిల్లీ పోవాల్సిందే’ అంటూ మండిపడ్డారు.
News December 11, 2024
HYD: 5 రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 11, 2024
HYD: అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.