News August 23, 2025
HYD: రేపు ఉదయం ఈ రూట్లు బంద్..!

HYDలో ఆదివారం ఉ.5 గంటల నుంచి పలు రూట్లు బంద్ ఉంటాయని పోలీసులు తెలిపారు. కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ (7:15 AM వరకు), ఇందిరానగర్ HCU గేట్ నంబర్-2 (11:30 AM వరకు), లెమన్ ట్రీ నుంచి సైబర్ టవర్స్ (8 AM వరకు), IKEA నుంచి సైబర్ టవర్స్ (8 AM వరకు), రోడ్ నంబర్ 45 వంతెన నుంచి కేబుల్ బ్రిడ్జి (8:30 AM వరకు) రూట్లు మూసి ఉంటాయి. SHARE IT
Similar News
News January 23, 2026
ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.
News January 23, 2026
వసంత పంచమి రోజు పఠించాల్సిన మంత్రాలివే..

చదువుల తల్లి ఆశీస్సుల కోసం ఈరోజు ‘సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం’ పఠించడం అత్యంత ఫలప్రదం. విద్యార్థులు ‘సరస్వతి నమస్తుభ్యం’ శ్లోకాన్ని 108 సార్లు జపించాలి. మేధాశక్తి పెరగడానికి ‘ఓం హ్రీం ఐం సరస్వత్యై నమః’ అనే బీజాక్షర మంత్రాన్ని ధ్యానించాలి. గ్రహ దోషాలు, బుధ గ్రహ దోషం ఉన్నవారు సరస్వతీ కవచం పఠించడం వల్ల వాక్చాతుర్యం లభిస్తుంది. భక్తితో ఈ మంత్రాలను స్మరిస్తే ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో విజయం లభిస్తుంది.
News January 23, 2026
ఒడిశాకు కీలక లైన్లు? ఏపీకి షాక్‌గా మారిన రైల్వే విభజన

విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ బౌండరీస్ చుట్టూ రాజకీయ వివాదం రాజుకుంటోంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అనుమానాలకు తావిస్తుండగా, జ్యూరిడిక్షన్ అంశం చర్చనీయాంశమైంది. వాల్తేర్ డివిజన్ ఆదాయానికి కీలకమైన KK లైన్‌ను ఒడిశా పరిధికి తరలించే ప్రయత్నాలు ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి.


