News October 12, 2024
HYD: రేపు ఉప్పల్‌లో మ్యాచ్.. బజరంగ్ దళ్ నిరసన
రేపు ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్-బంగ్లా మ్యాచ్‌లో జెండాలతో బజరంగ్ దళ్ శాంతియుత నిరసన తెలియజేస్తుందని దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని, హిందువులపై దాడులు చేయడాన్ని ఖండిస్తూ నిరసన చేపట్టినట్లు ఆయన వివరించారు. అంతేకానీ.. మ్యాచ్‌ను అడ్డుకోనున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
Similar News
News November 9, 2024
RR: యువత మేలుకో… ఓటరు నమోదు చేసుకో!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదుకు అధికారులు బూత్ స్థాయి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వాళ్లంతా 2024 నవంబర్ 28లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటరు నమోదుకుఫాం-6,అభ్యంతరాలకు ఫాం-7,సవరణలకు ఫాం-8 నింపాలి.voters.eci.gov.in లేదా voter helpline యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.>>1950(TOLL FREE)
News November 9, 2024
HYD: BRS, BJPపై మంత్రి పొన్నం ఫైర్
BRS, BJPపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈరోజు HYD నాంపల్లిలోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. KCR, KTR, హరీశ్ రావును అరెస్ట్ చేస్తామని, జైలుకు పంపుతామని గతంలో బండి సంజయ్ అన్నారని గుర్తు చేశారు. కానీ తాము చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని, బండి సంజయ్ సోయి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. BRS, BJP ఒక్కటే అని, కులగణన, మూసీ ప్రక్షాళనను అడ్డుకోవద్దని కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ను హెచ్చరించారు.
News November 9, 2024
HYD: శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు బుక్ చేసుకోండి!
పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర దేవాలయాలకు HYD నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. NOV 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని, ఏపీ పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులు ఉంటాయన్నారు.