News August 13, 2025
HYD: రేపు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలి: సైబరాబాద్ పోలీసులు

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగులకు రేపు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఉద్యోగులకు రేపు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించాలని ఐటీ కంపెనీలను సైబరాబాద్ పోలీసులు కోరారు. దీంతో ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ సూచించారు. వీలైనంత వరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. SHARE IT
Similar News
News March 9, 2026
SKLM: విద్యార్థులు అలర్ట్.. ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్ డే

ఎచ్చెర్లలోని డాక్టర్ B.R.అంబేడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీ 2021-22, 2022-23, 2023-24 అడ్మిటెడ్ బ్యాచ్ ఆరో సెమిస్టర్ ఇంటర్న్ షిప్ ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు అభ్యర్థులు రూ.1425లను ఆయా కళాశాలలో, యూనివర్సిటీకి వచ్చి చెల్లించాలని ఎగ్జామినేషన్స్ డీన్ ఎం.అనురాధ ప్రకటనలో వెల్లడించారు. రూ.500 ఫైన్‌తో ఈ నెల 10 వరకు, రూ.1500 ఫైన్‌తో 11 తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు అన్నారు.
News March 9, 2026
సూర్యాపేట: సైబర్ నేరాలు.. ఊరు వదిలి వెళుతున్నారు

సూర్యాపేట జిల్లాలో ఇటీవల కొంతమందిపై సైబర్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. భయంతో కొంతమంది సైబర్ నేరగాళ్లు గ్రామాలు వదిలి వెళుతున్నట్లు సమాచారం. HYDతో పాటు పలు ద్వితీయ శ్రేణి పట్టణాలలో ఉంటున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. సైబర్ నేరాల్లో జీవితం నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News March 9, 2026
VKBలో ఎండలు.. జంకుతున్న ప్రజలు

భానుడి ప్రతాపం అధికంగా ఉండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రధానంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు జిల్లా అంతా తిరుగుతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక బయటికి రాని పరిస్థితి ఉన్నప్పటికీ తప్పనిసరిగా బయటికి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వారంలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వారంలో 40 డిగ్రీలు టచ్ అయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్ర హెచ్చరించింది.


