News April 1, 2024

HYD: రేవంత్ పాలన చూసి ప్రజలు సంతోషిస్తున్నారు: మంత్రి

image

100 రోజుల రేవంత్ రెడ్డి పాలనను చూసి ప్రజలు సంతోషిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో HYD ఎల్బీనగర్ పరిధి కర్మన్‌ఘాట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌ను అసెంబ్లీ ఎన్నికలో ఆదరించారని, అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిపించాలని కోరారు. మూసీ ప్రక్షాళనకు CM రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. BRSను నమ్మొద్దన్నారు. 

Similar News

News February 8, 2026

HYD: రేపు జయశంకర్ అగ్రీ వర్సిటీ స్నాతకోత్సవం

image

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మెగా స్నాతకోత్సవం రేపు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ప్రొ.అల్దాస్ జానయ్య తెలిపారు. ముడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్నాతకోత్సవాలను ఒకేసారి వర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం కులపతి జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు ప్రభు పింగళి హాజరుకానున్నట్లు తెలిపారు.

News February 4, 2026

రంగారెడ్డి జిల్లా DEOపై ACBకి ఫిర్యాదు!

image

రంగారెడ్డి జిల్లా DEO సుశీందర్రావు ఆస్తిపాస్తుల, ఆదాయ వ్యయాలపై వెంటనే పూర్తి సమగ్ర విచారణ చేయాలని తెలంగాణ BC సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ACBకి ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లాలోని అందరూ MEOలు, DEO ఆఫీసులో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న బాదం వెంకటేశ్, లక్ష్మీనరసింహులు ఆస్తులపైనా సమగ్ర విచారణ చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

News February 4, 2026

మహిళా పారిశ్రామికవేత్తలకు డిజిటల్ సాధికారత

image

GHMC, MEPMA- ISB సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సూక్ష్మ పారిశ్రామిక వేత్తలకు డిజిటలైజేషన్, వ్యాపార సామర్థ్య పెంపుపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 400 మంది మహిళలకు వాట్సాప్ బిజినెస్, ఇన్స్టాగ్రామ్ స్టోర్‌ఫ్రంట్స్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. సూక్ష్మ రుణాల లభ్యత, మార్కెటింగ్ మెళకువలతో మహిళా స్వయం ఉపాధి రంగాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.