News April 23, 2025

HYD: రోడ్డు తవ్వుడే.. మరి వేసేదెన్నడు..?

image

గ్రేటర్ HYDలో ఉప్పల్, బంజారాహిల్స్, నాచారం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మల్లాపూర్ లాంటి అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, మరమ్మతుల రీత్యా అధికారుల ఆదేశాలతో సిబ్బంది రోడ్లను తవ్వుతున్నారు. కానీ, ఆ రోడ్ల మరమ్మతులకు మాత్రం నోచుకోవడం లేదు. దీంతో నెలల తరబడి అలాగే ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మీ ఏరియాలో ఈ సమస్య ఉందా..? కామెంట్ చేయండి.

Similar News

News March 6, 2026

కమ్మర్‌పల్లి ప్రాంతంలో పులి సంచారం

image

మహారాష్ట్రలోని తాడోబా నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం కమ్మర్‌పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో సంచరిస్తోంది. మూడు రోజుల క్రితం కమ్మర్పల్లి రేంజ్లోకి వచ్చిన ఈ పులి ఇదేచోట వన్యప్రాణిని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. బీట్ ఆఫీసర్ శ్రీదేవి ఈ పులిని ప్రత్యక్షంగా చూశారని తెలిసింది.

News March 6, 2026

గద్వాల్: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు.. ఈ నెల 10 ఆఖరు

image

రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లలో 2026-27 ఏడాదిలో 6 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 10వ తేదీ వరకు గడువు ఉంది. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతోపాటు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, టీపీటీ, సీఎస్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

News March 6, 2026

పార్వతీపురం: జువాలజీ, ఎకనామిక్స్ పరీక్షకు 225 మంది డుమ్మా

image

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన ఇంటర్ సెకండియర్ జువాలజీ, ఎకనామిక్స్ పరీక్షకు 224 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DVEO నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు. జనరల్ విద్యార్థులు 3409 మందికి 101 మంది గైర్హాజరు అయ్యారని చెప్పారు. ఒకేషనల్ విద్యార్థులు 2578 మందికి గానూ 123 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు. మొత్తం 5987 మంది విద్యార్థులకు 224 మంది గైర్హాజరు అయ్యారని అన్నారు.