News October 6, 2025
HYD రోడ్లపైకి రోజుకి కొత్తగా 1,500 వాహనాలు

మహా నగరంలో ట్రాఫిక్ సమస్య పెను సవాల్‌గా మారింది. ట్రాఫిక్ అంశంలో బెంగళూరు అధ్వానమని అందరూ అంటారు. కానీ.. HYD ఆ దశలోనే వెళ్తుందని హోం శాఖ సెక్రటరీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇప్పటికే HYDలో సుమారు 92 లక్షల వాహనాలు ఉండగా.. ప్రతిరోజు కొత్తగా 1,500 వాహనాలు రోడ్లెక్కుతున్నాయని పేర్కొన్నారు.
Similar News
News January 19, 2026
ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి: కదిరి సీఐ

నల్లచెరువు (M) చవిటివారిపల్లి గ్రామానికి చెందిన సి.సాయి చరణ్ రెడ్డి (B.Tech) కదిరి టౌన్‌లో నివాసం ఉంటున్నారు. అతనికి లక్ష్మీపతి, షరీఫ్, చంద్ర పరిచయమై సాఫ్ట్‌వేర్ వర్క్ ఫ్రం హోం ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.3,50,000 ఆన్‌లైన్ పేమెంట్ చేయించుకుని మోసం చేసినట్లు వాపోయాడు. భాదితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
News January 19, 2026
మంచిర్యాల: ఆ ముగ్గురు ఎవరు..?

జిల్లాలోని 302 గ్రామపంచాయతీల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ప్రతి పంచాయతీకి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండటంతో రాజకీయ సందడి మొదలైంది. ముఖ్యంగా ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈ పదవుల ద్వారా ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. 306 పంచాయతీలు ఉన్న జిల్లాలో, ఎన్నికలు ముగిసిన చోట్ల ఆశావహులు తమ పార్టీ పెద్దల వద్ద పైరవీలు ముమ్మరం చేశారు.
News January 19, 2026
కామారెడ్డి: జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి ప్రభావం తీవ్రమవుతోంది. సోమవారం ఉదయం నమోదైన గణాంకాల ప్రకారం జిల్లాలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 10.8°Cగా నమోదైంది. ముఖ్యంగా మాచారెడ్డి (లచ్చపేట)లో 12.3°C, జుక్కల్‌లో 12.3°C, గాంధారి (రామలక్ష్మణపల్లి)లో 12.8°C, ఎల్లారెడ్డి (మాచాపూర్)లో 13.7°C, దోమకొండలో 13.7°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


