News August 22, 2025
HYD: లైక్ కొడితే డబ్బు కట్.. జాగ్రత్త!

నగర ప్రజలు సైబర్ మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. టెలిగ్రామ్‌లో వచ్చే లింకుల మీద క్లిక్ చేసి, ప్రతిదానికి లైక్ కొడితే డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పే మాయమాటలు నమ్మొద్దన్నారు. అలాంటి వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒక లింకుతో కుషాయిగూడకి చెందిన వ్యక్తి తాజాగా రూ.1.370 లక్షలు, అంబర్‌పేటకు చెందిన మరో వ్యక్తి రూ.24 వేలు పోగొట్టుకున్నారు. జాగ్రత్త..!
Similar News
News January 23, 2026
VKB: 1800-102-7222కు కాల్ చేయండి

జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్-12లో 106 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించామని వికారాబాద్ SP స్నేహ మెహ్రా తెలిపారు. శుక్రవారం ఎస్పీ ఆఫీస్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. వీరిలో 90 మంది బాలురు, 16 మంది బాలికలు ఉన్నారు. యజమానులు 14ఏళ్లలోపు బాలలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1908, 1800-102-7222, 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
News January 23, 2026
విశాఖ: మద్యం డబ్బుల కోసం RTC బస్సు చోరీ

మద్యం డబ్బుల కోసం ఓ వ్యక్తి APSRTC బస్సును దొంగిలించాడు. ఈ ఘటన జనవరి 17న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. మద్దిలపాలెం డిపోలో పార్క్ చేసిన బస్సు మాయమవడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు అనకాపల్లి (D) మారేడుపూడికి చెందిన పైడిరాజును ఈనెల 19న పట్టుకున్నారు. డీజిల్ అమ్మి మద్యం తాగాలనే ఉద్దేశంతోనే బస్సు ఎత్తుకెళ్లినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
News January 23, 2026
ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు వెల్లుల్ల మహిళ

మెట్ పల్లి మండలం వెల్లుల్లకు చెందిన జాగృతి మహిళ మండల సమాఖ్య అధ్యక్షురాలు గోర్ల లతకు ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందింది. గొర్ల లత స్వశక్తి సంఘంలో చేరి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలిగా, జాగృతి మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నుకోబడి జిల్లా మహిళ సమాఖ్య ఈసీ మెంబర్గా ఉన్నారు. గణతంత్ర వేడుకలకు ఎంపికైన ఆమెను ఏపీఎం, సీసీలు, మహిళ సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు అభినందించారు.


