News August 14, 2025
HYD: లైఫ్ సైన్సెస్‌పై పెరుగుతున్న ఆసక్తి

ఇప్పుడు లైఫ్‌సైన్సెస్‌పై విద్యార్థుల ఆసక్తి పెరుగుతోంది. HYDలోని డిగ్రీ విద్యలో అనేక కాలేజీలలో లైఫ్ సైన్సెస్ కోర్సు తీసుకున్న వారి సంఖ్య అత్యధికంగా పెరిగినట్లుగా అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే 12% పెరిగినట్లు అధికారులు తెలిపారు. లైఫ్‌సైన్సెస్ కోర్సు చేసిన వారికి, అనేక అవకాశాలు ఉన్నట్లు పలు సంస్థలు రిపోర్టులు వెల్లడించాయి
Similar News
News March 17, 2026
ఓడ నుంచి సిలిండర్లలోకి LPG.. ప్రాసెస్ ఇదే!

‘నందాదేవి’ షిప్ INDకు <<19406038>>చేరుకుంది<<>>. పైపుల ద్వారా గ్యాస్‌ను పంపించేందుకు దానిని -40°Cకు చల్లబరుస్తారు. ఓడరేవుకు షిప్ రాగానే దానికి పైపులను అటాచ్ చేసి ప్రెజర్ పంపుల ద్వారా ద్రవ రూపంలో ఉన్న గ్యాస్‌ను తీరంలోని స్టోరేజ్ ట్యాంకుల్లోకి పంపిస్తారు. అక్కడ వడపోసిన తర్వాత గ్యాస్ లీక్ అయితే గుర్తుపట్టడానికి ప్రత్యేక పదార్థాన్ని కలుపుతారు. ఆ తర్వాత ఖాళీ సిలిండర్లలో సరైన పరిమాణంలో గ్యాస్ నింపి సీల్ వేస్తారు.
News March 17, 2026
ఏలూరి ఎంపీకి తొలి డ్రగ్ టెస్టులో నెగిటివ్.. కారణం ఇదే?

మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ కేసులో సిట్ చీఫ్ యోగేశ్ గౌతమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ పుట్టా మహేశ్ మెథ్, కొకైన్ వంటి రెండు రకాల డ్రగ్స్ తీసుకున్నారని చెప్పారు. డ్రగ్ శరీరంలోకి చేరేలోపే టెస్ట్ చేయడంతో ఎంపీ మహేశ్‌కు తొలుత నెగిటివ్ వచ్చిందన్నారు. 5 గంటల తర్వాత రెండోసారి టెస్ట్ చేసినప్పుడు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని పేర్కొన్నారు.
News March 17, 2026
BIG BREAKING: KNR: నేను కాంగ్రెస్‌లోనే ఉన్నాను: జీవన్‌రెడ్డి

తాను ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఈరోజు జగిత్యాలలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ను వదిలితే ఫ్లెక్సీలు ఏంటి అన్నీ మారతాయన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ వదిలితే ఎందులో చేరాలో ఆలోచిస్తానన్నారు. తాను పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం MLA సంజయ్ అని, కాంగ్రెస్‌తో తనది 40 ఏళ్ల బంధమన్నారు. తనకు ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.


