News October 8, 2025

HYD: వరల్డ్ స్కిల్ కాంపిటీషన్‌.. అప్లై చేసుకోండి

image

వరల్డ్ స్కిల్ కాంపిటీషన్-2025లో పాల్గొనేందుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి వందన తెలిపారు. ఈ పోటీల్లో 63 కేటగిరీలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించవచ్చు. జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఉంటాయి. ఉమ్మడి RR, HYD జిల్లాలోని అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News January 19, 2026

అలర్ట్.. అమలాపురంలో జాబ్ మేళా..!

image

అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 21న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారి వసంత లక్ష్మి సోమవారం తెలిపారు. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఉదయం 10:30 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయి. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు తమ బయోడేటా, ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News January 19, 2026

KMR: అభ్యర్థుల ఎంపికకు కసరత్తు

image

మరో రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నగరా మోగనుండటంతో అభ్యర్థుల ఎంపికకు ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డిలలో ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థులకు వ్యక్తిగతంగా బరిలో నిలిచేందుకు సూచించగా, అధికారికంగా జాబితాను ప్రకటించనుంది. కాంగ్రెస్, BRS పార్టీలు ఎలాగైనా మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి గట్టి పోటీనిచ్చే అభ్యర్థుల ఎంపికకు ముమ్మర ప్రయత్నం చేస్తోంది.

News January 19, 2026

న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి.. షమీ ఉండాల్సిందేమో!

image

న్యూజిలాండ్‌తో సిరీస్ కోల్పోయి టీమ్ ఇండియా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ముఖ్యంగా NZ ప్లేయర్ మిచెల్ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. సిరీస్‌లో అతను 352 పరుగులతో విధ్వంసం చేశారు. ఈ క్రమంలో పలువురు స్టార్ బౌలర్ షమీని గుర్తు చేస్తున్నారు. అతడు ఉండుంటే మిచెల్ ఆటలు సాగేవి కావని, గత రికార్డులే అందుకు నిదర్శనమని అంటున్నారు. ఇరువురి మధ్య పోరులో 16 సగటుతో 4 సార్లు ఔట్ చేసి షమీ ఆధిపత్యం ప్రదర్శించారు.