News August 22, 2025
HYD: వర్షాలతో కాస్త పెరిగిన భూగర్భజలం!

HYD వ్యాప్తంగా ఇటీవల కురిసిన విస్తారమైన వర్షాలతో భూగర్భజలం పెరిగినట్లు భూగర్భ జిల్లా శాఖ తెలిపింది. అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా గత రికార్డుతో పోలిస్తే జిల్లాలో 2.71 మీటర్ల వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. RR, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోనూ కాస్త మెరుగుపడ్డట్లుగా తెలిపింది. భూగర్భ జలాలు పెరుగుదలకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించాలని జలమండలి సూచించింది.
Similar News
News January 22, 2026
HYD: ఇంటి వద్దే FIR.. ఈ కేసులకు మాత్రమే వర్తింపు

బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్న ఇంటికి వచ్చే FIR విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. బుధవారం TGICCCలో ఆయన అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో ఈ విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు.
News January 22, 2026
HYD: మేడారం వెళ్తున్నారా..? 7658912300కి ‘HI’ పెట్టండి

మేడారం జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం తొలిసారి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు 7658912300 నంబర్‌కు ‘HI’ అని మెసేజ్ చేస్తే జాతర వివరాలను తెలుసుకోవడంతో పాటు పలు రకాల సేవలను పొందొచ్చు. జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్‌డేట్స్, పార్కింగ్, వైద్య కేంద్రాలు, స్నానపు ఘట్టాలు సహా ఇతర వివరాలను నేరుగా వాట్సాప్‌లోనే చూడ
News January 22, 2026
HYD: PSకు రాకుండా కంప్లైంట్ ఇవ్వొచ్చు: సీపీ

నేర బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు తెలంగాణ పోలీస్ విక్టిమ్ సెంట్రిక్ విధానాన్ని తెచ్చినట్లు HYD సీపీ సజ్జనార్ తెలిపారు. ఇకపై బాధితులు స్టేషన్‌కు రాకుండానే.. పోలీసులు ఇంటికే వచ్చి FIR నమోదు చేస్తారని చెప్పారు. అకారణంగా ఏ బాధితుడైనా పోలీస్ స్టేషన్‌కు తిరగాల్సి వస్తే.. సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వాట్సాప్‌లో 94906 16555కు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.


