News October 8, 2025

HYD: వాటర్ ట్యాంకర్లు ‘మాయం’.. చేయలేరిక

image

నీటి ట్యాంకర్ల దారి మళ్లింపులు, అక్రమ బిల్లింగ్‌లపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు HMWSSB ఆటోమేటిక్ వెహికల్ ట్రాకింగ్ సిస్టం (AVTS) తీసుకొచ్చింది. యాప్‌లో లైవ్ ట్రాకింగ్‌తో ట్యాంకర్లు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. ట్రిప్, బిల్లు డిజిటల్‌గా రికార్డ్ అవ్వడంతో అక్రమాలకు తావుండదు. వాహనం ఆలస్యమైనా అధికారులకు అలర్ట్‌లు వెళ్తాయి. ఈ అప్‌గ్రేడ్‌తో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకమైన సేవలు అందుతాయి.

Similar News

News January 12, 2026

విమానాశ్రయం భూములను పరిశీలించిన ప్రకాశం కలెక్టర్

image

కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదించిన భూములను కలెక్టర్ రాజబాబు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎయిర్ పో‌ర్టు అథారిటీ నుంచి వచ్చిన టెక్నికల్ టీం సభ్యులు ఆయుషి రాయ్‌తో కలిసి కలెక్టర్ భూముల వివరాలను సంబంధిత మ్యాపుల ద్వారా పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై ఎయిర్ పో‌ర్టు అథారిటీ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.

News January 12, 2026

వీఎన్ పల్లె తహశీల్దార్‌కు షోకాజ్ నోటీసులు

image

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన వీఎన్ పల్లె తహశీల్దార్ లక్ష్మీదేవితో పాటు మరో 11 మందికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీలోగా గ్రామసభల ద్వారా రైతులకు పుస్తకాలు అందజేయాలని ఆదేశించినా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

News January 12, 2026

ప్రకాశం SP ‘మీకోసం’కు 58 ఫిర్యాదులు

image

ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం SP మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా SP హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో ఈ కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు హాజరై తమ సమస్యలను తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. SP కార్యాలయం ఈ వివరాలను ప్రకటించింది.