News September 12, 2025
HYD: వాట్సాప్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదుదారులకు ఎఫ్‌ఐఆర్‌ను వాట్సాప్‌లో పంపించే సరికొత్త విధానానికి సీపీ అవినాష్ మహంతి శ్రీకారం చుట్టారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి బాధితుడికి వాట్సాప్‌లో పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో పోలీసు సేవలు పారదర్శకంగా ఉండటంతో పాటు, ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
చివ్వెంల: తల్లికి సేవ చేసిన బిడ్డ కోతి: ముల్లులు తీసిన వైనం

చివ్వెంల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం బయట ఒక చెట్టుపై ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆహారం కోసం వెళ్లొచ్చిన తల్లి కోతి చెట్టుపై కూర్చోగా, దాన్ని గమనించిన బిడ్డ కోతి పరిగెత్తి తల్లి ఒడిలో కూర్చుంది. తల్లి కోతి ముఖానికి గుచ్చుకున్న ముల్లులను చూసి చలించిపోయిన బిడ్డ కోతి, చాలాసేపు బాధపడుతూ ఆ ముల్లులను తీసింది. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానిక ప్రజలు ఆశ్చర్యంగా తిలకించారు.
News December 8, 2025
నరసరావుపేట: రైల్వే ట్రాక్‌లపై నిత్యం మృత్యు ఘోష

నరసరావుపేట రైల్వే PS పరిధిలో ఈ ఏడాది JAN-DEC మధ్యలో 19 సూసైడ్‌లు, 20 ప్రమాదాలు జరిగాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ప్రేమ విఫలం, అనారోగ్యంతో కొందరు, ప్రమాదవశాత్తూ మరికొందరు రైల్వే ట్రాక్‌లపై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం లేదనుకొనిని ప్రాణాలు రైలు చక్రాల కింద నలిగిపోతున్నాయి. ఇలా ఏదో ఒక రూపంలో పట్టాలపై మృత్యు ఘోష నిత్యం వినిపిస్తోంది. కొందరు మృతుల ఆధారాలు కూడా దొరకడం లేదు.
News December 8, 2025
సాలూరు: విహారయాత్రకు వెళ్లి ఒకరి మృతి

సాలూరు (M) దళాయివలస జలపాతం వద్ద ఆదివారం ఒకరు మృతి చెందారు. రామభద్రపురానికి చెందిన హరి స్నేహితులతో కలిసి విహారయాత్రకు జలపాతానికి వెళ్లాడు. జలపాతం దిగువ ప్రాంతంలో ఈతకు వెళ్లి ఊబిలో కురుకుపోవడంతో స్థానికుల సహకరంతో హరిని బయటకు తీసి సాలూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


