News August 13, 2025
HYD: వానొచ్చినా.. వరదొచ్చినా.. మెట్రోనే బెస్ట్

నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏ రోడ్డెక్కినా ట్రాఫిక్ జామ్ తప్పడం లేదు. HYDకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో వాహనదారులు అయోమయంలో పడ్డారు. దీంతో మేమున్నామంటూ మెట్రో పేర్కొంది. వానొచ్చినా.. వరదొచ్చినా.. ప్రయాణికుల మీద చినుకుపడకుండా గమ్య స్థానాలకు చేర్చుతామని తెలిపింది. చింతలేకుండా ప్రయాణించాలని భరోసానిస్తోంది. ఫ్లడ్స్ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటోందని, సర్వీసులు పెంచాలని నగరవాసులు కోరుతున్నారు.
Similar News
News March 11, 2026
అడవి వదిలి… ఊరి బాట పట్టిన వానరాలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో కోతుల గుంపులు ప్రజలను వణికిస్తున్నాయి. అడవిని విడిచి ఊర్ల బాట పట్టిన కోతులు, నేరుగా ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయి. పర్యాటక ప్రాంతాలు, ఆలయాల వద్ద భక్తులు ఇచ్చే ఆహారానికి అలవాటు పడి ఇప్పుడు అడవిలో ఆహారం వెతుక్కోవడానికి ఇష్టపడటం లేదు. దీంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా భయాందోళన చెందుతున్నారు.
News March 11, 2026
2 రోజుల్లో ₹51,400 కోట్ల ఆయుధాలు

ఇరాన్ యుద్ధంలో అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. యుద్ధం మొదలైన మొదటి 48 గంటల్లోనే ట్రంప్ యంత్రాంగం సుమారు ₹51,400 కోట్ల విలువైన ఆయుధాలను వాడేసినట్లు సమాచారం. కేవలం క్షిపణులు, బాంబులకే ఇంత ఖర్చు కాగా.. సైనిక మోహరింపు వ్యయం అదనం. ఈ స్థాయిలో ఖర్చు చేయడం అమెరికా కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతటి భారీ ఖర్చుతో కూడిన యుద్ధాన్ని పెంటగాన్ ఎంతకాలం కొనసాగించగలదనే దానిపై చర్చలు మొదలయ్యాయి.
News March 11, 2026
పాలకవర్గ గడువు ముగియకముందే స్టాండింగ్ కమిటీ సమావేశం

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఈనెల 13న నిర్వహించనున్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అజెండా సిద్ధం చేసి సభ్యులకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం. గతంలో పెండింగ్‌లో ఉన్న కొన్ని అంశాలు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.


