News March 28, 2025

HYD: వామ్మో.. ఏంటీ పరిస్థితి..!

image

గ్రేటర్ HYDలో అనేక ప్రాంతాల్లో దోమల బెడద ఉన్నట్లు GHMC దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. ఖైరతాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ అన్సారి ట్వీట్ గ్రేటర్ పరిస్థితికి అద్దం పడుతోంది. దోమలను చంపేసి తన ఇంటి ఫ్లోర్‌పై ఏకంగా కుప్పలు తెప్పలుగా ఉంచిన ఫోటోను అధికారులకు చూపుతూ, ఏంటి ఈ పరిస్థితి..? ఇలా అయితే విష జ్వరాలు సోకే అవకాశం ఉందన్నారు. మరి మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది. GHMC చర్యలపై మీ కామెంట్.

Similar News

News April 19, 2025

మన ‘పాకాల’ నీరు.. సముద్రంలో కలుస్తోందిలా!

image

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు వరద నీరు 192 కి.మీ ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ‘పాకాల’ వాగు.. ప్రవాహ క్రమేణా ‘మున్నేరు’గా మారి ఏపీలోని కంచికచర్ల వద్ద కృష్ణా నదిలో కలుస్తోంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా బంగాళాఖాతం సముద్రంలో కలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంత రైతులకు, ప్రజలకు పాకాల నీరు జలవనరుగా ఉంది.

News April 19, 2025

సిద్దిపేట: కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

image

కరెంట్ షాక్ తగిలి <<16142215>>విద్యార్ధి మృతి<<>> చెందిన ఘటన తోగుట(M)లో జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. తుక్కాపూర్‌‌కు చెందిన చికుడ్క స్వామి గురువారం రాత్రి తన ఇద్దరి కుమారులతో కలిసి ఆలయం వద్దకు వెళ్లారు. గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ నిర్వహించేందుకు విద్యుత్ డెకరేషన్ ఏర్పాటు చేశారు. ఆ వైరు ఇనుప పైపునకు తగిలిఉంది. ప్రణీత్ ఆడుకుంటూ ఇనుప పైపునకు తగలడంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.

News April 19, 2025

రేపే బీసీ గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

image

TG: బీసీ గురుకుల స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతి సీట్లను భర్తీ చేసేందుకు రేపు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 109 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. మొత్తం 6,832 బ్యాక్‌లాగ్ సీట్లకు 26,884 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు.

error: Content is protected !!