News November 7, 2025

HYD: వారంలో కూతురి పెళ్లి.. ఇంతలోనే విషాదం..!

image

జనగామ(D) బచ్చన్నపేట(M) ఆలీంపూర్‌లో రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD ECILలోని ఆర్టీవన్ కాలనీ వాసి బండి శ్రీనివాస్(50) తన కూతురిని సిద్దిపేట(D) కొండపాక(M) వెలికట్టెకు చెందిన ఓయువకుడికి ఇచ్చి ఈనెల 13న పెళ్లి చేయాల్సి ఉంది. ఈ క్రమంలో చేర్యాల(M) ముస్త్యాలలో బంధువులకు పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వెళ్తుండగా బైక్, DCM ఎదురెదురుగా ఢీకొనగా శ్రీనివాస్ మరణించాడు.

Similar News

News January 24, 2026

VJA: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. బాలుడి ఇంటికి వెళ్లిన బాలిక

image

సోషల్ మీడియా పరిచయాలు యువతను పెడదారి పట్టిస్తున్నాయి. ప్రసాదంపాడుకు చెందిన ఓ బాలికను ఈ నెల 21న తల్లి మందలించడంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన పామర్రుకు చెందిన బాలుడి ఇంటికి వెళ్లిపోయింది. అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నానని చెప్పి నేరుగా బాలుడి వద్దకు వెళ్లడంతో అతని కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. బాధ్యతగా వ్యవహరించిన బాలుడి కుటుంబీకులు వెంటనే బాలికను పటమట పోలీసులకు అప్పగించారు.

News January 24, 2026

బిడ్డను నరబలి ఇచ్చిన తల్లికి ఉరిశిక్ష రద్దు!

image

TG: 2021లో సూర్యాపేట జిల్లాలో మూఢనమ్మకంతో 7 నెలల పసికందును నరబలి ఇచ్చిన కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితురాలు బానోత్ భారతికి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. ఘటన సమయంలో భారతి తీవ్రమైన మానసిక అనారోగ్యంతో ఉందని, ఏం చేస్తుందో కూడా తెలియని స్థితిలో ఉన్నందున నేరం వర్తించదని స్పష్టం చేసింది. ఆమెను తక్షణమే మానసిక చికిత్స కేంద్రానికి తరలించాలని ఆదేశించింది.

News January 24, 2026

నిర్మల్: డీలర్ వద్దే వాహన రిజిస్ట్రేషన్

image

వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పు తెచ్చింది. శనివారం (జనవరి 24) నుంచి కొనుగోలు చేసే వాహనాలకు డీలర్ పాయింట్ వద్దే రిజిస్ట్రేషన్ జరుగుతుందని రవాణా శాఖ అధికారులు దుర్గాప్రసాద్, మహేందర్ తెలిపారు. వాహనదారులు ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, షోరూమ్‌లోనే ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల సమయం, శ్రమ ఆదా అవుతుందన్నారు.