News August 22, 2025
HYD- విజయవాడకు E-గరుడలో 26% డిస్కౌంట్

HYD-విజయవాడ మార్గంలో ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మార్గంలో ఈ-గరుడ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరపై 26% రాయితీ ప్రకటించింది. ఈ- గరుడ బస్సులు కాలుష్య రహితమైనవని, పర్యావరణహితమైనవని, 100% సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని RTC అధికారులు తెలిపారు. ఈ మార్గంలో TGSRTC 10 ఈ-గరుడ బస్సులను నడుపుతోంది.
Similar News
News January 19, 2026
గంగవరం డ్రైవర్స్ కాలనీలో జోరుగా వ్యభిచారం?

గంగవరం(M) డ్రైవర్స్ కాలనీలో జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మదనపల్లె, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి ఓ మహిళ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నా ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం. నిత్యం కాలేజీ విద్యార్థులు, బయట ప్రాంతాల నుంచి విటులు రావడంతో గ్రామస్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
News January 19, 2026
భద్రాద్రిలో వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి నిత్య కళ్యాణ వేడుక సోమవారం కన్నులపండువగా జరిగింది. ఉదయం గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం బేడామండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యవాచనం గావించారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ గావించి సీతమ్మతో కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు.
News January 19, 2026
VJA: వామ్మో.. పండుగ 3 రోజుల్లో ఇంత తాగేశారా!

సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఈ నెల 12 నుంచి 14 వరకు మూడు రోజుల్లో మొత్తం రూ. 38 కోట్ల సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విక్రయాలు రూ. 4 కోట్లు పెరిగాయి. జిల్లాలో జరిగిన కోడిపందేలు, పండుగకు వచ్చిన జనసందోహం ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. జనవరి 15, 16 తేదీల్లో మద్యం డిపోలకు సెలవు కావడంతో విక్రయాలు జరగలేదు.


