News September 12, 2025
HYD: విద్యుత్ సమస్యల పరిష్కారానికి వాట్సప్ గ్రూప్

బంజారాహిల్స్ డివిజన్లో విద్యుత్ అధికారులు సమస్య పరిష్కారానికి వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. ఇక్కడ 195 ఫీడర్లుండగా ఆ వినియోగదారులతో కలిపి 195 వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ప్రజలు తమ విద్యుత్ సమస్యను గ్రూపులో పోస్టు చేస్తే వెంటనే సిబ్బంది సమస్యను పరిష్కరిస్తారు. గ్రూపుల్లో సిబ్బందితోపాటు 30 మంది అధికారులు కూడా ఉంటారు. వీటితోపాటు 1912 సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
Similar News
News December 10, 2025
KNR: తొలి విడత జీపీ పోలింగ్‌కు సర్వం సిద్ధం

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు మండలాల్లో డిసెంబర్ 11న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. 92 పంచాయతీల పరిధిలోని 866 పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాల మోహరింపు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. సున్నిత కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ వెల్లడించారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధం. నిషేధాజ్ఞలు కొనసాగుతాయన్నారు.
News December 10, 2025
కరీంనగర్: ఎన్నికల కోసం పోలీస్ సిబ్బంది కేటాయింపు

కరీంనగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 782 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఇందులో ఆరుగురు ఏసీపీలు, 19 మంది ఇన్‌స్పెక్టర్లు, 40 మంది SIలు, 34మంది హెడ్ కానిస్టేబుల్స్, 392మంది కానిస్టేబుళ్ళు, 47మంది స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, 144 హోంగార్డ్స్, 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులని ఆయన తెలిపారు. పోలింగ్ బందోబస్తు చేసే పోలీసులకు దిశా నిర్దేశం చేశారు.
News December 10, 2025
విజయవాడ: 18 లడ్డూ విక్రయ కేంద్రాల ఏర్పాటు

విజయవాడ అమ్మవారి దర్శనార్థం విచ్చేయు దీక్షా దారులకు కోసం 34.50 లక్షల లడ్డులను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత ప్రసాద భవనంతో పాటు నూతన ప్రసాద తయారీ భవనం, శృంగేరి షెడ్డులో నిరంతరంగా లడ్డు తయారీ జరుగుతోంది. ప్రసాద విక్రయానికి మొత్తం 18 కౌంటర్లు ఏర్పాటు చేశారు. కొండపై 1, రైల్వే స్టేషన్ వద్ద 1, బస్టాండ్ వద్ద 1, ఇతర ప్రాంతాల్లో 4 కౌంటర్లు అందుబాటులో ఉంటాయి.


