News December 1, 2025

HYD: విమానంలో మహిళా సిబ్బందికి లైంగిక వేధింపులు

image

దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళా క్యాబిన్ సిబ్బందిని ఓ ప్రయాణికుడు లైంగికంగా వేధించాడు. విమానం హైదరాబాద్ చేరుకోగానే RGIA పోలీసులు కేరళకు చెందిన ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు, లైంగిక వేధింపులు, దాడికి సంబంధించిన BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 17, 2026

రికార్డుల వేట.. ఎగవేతదారుల కోటలకు బీట!

image

సెల్ఫ్ అసెస్‌మెంట్ పేరుతో ఆస్తి పన్ను లెక్కల్లో మాయాజాలం చేసిన వారికి కాలం చెల్లింది. అద్దె విలువను (ARV) తక్కువ చూపిస్తూ పన్ను ఎగ్గొట్టే బడా బాబుల గుట్టు రట్టు చేసేందుకు సర్కార్ ‘డిజిటల్ అస్త్రాన్ని’ ప్రయోగించింది. ఇంటి పన్ను పత్రం, కరెంటు మీటర్, రిజిస్ట్రేషన్ డేటా ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఇళ్లు అని చెప్పి సాఫ్ట్‌వేర్ ఆఫీసులు, హాస్టళ్లు నడిపేవారికి కరెంటు బిల్లులే సాక్ష్యంగా మారుతున్నాయి.

News February 17, 2026

HYDలో రాజకీయ నేతలు ‘డబుల్ గేమ్’

image

HYDలో ఆస్తి పన్ను పెంచాలంటే సర్కారుకు చెమటలు పడుతున్నాయి. ARV పెంచుతూ మున్సిపల్ శాఖ నోటీసులు ఇస్తుంటే యజమానులు ‘స్టాండర్డ్ రెంట్’ సాకుతో కోర్టు మెట్లెక్కుతున్నారు. అద్దె నియంత్రణ చట్టం ప్రకారం పాత అద్దెలనే ప్రామాణికంగా తీసుకోవాలని, ఇష్టానుసారం పన్ను వేయకూడదని యజమానుల వాదన. ఏటా వందల రూ.కోట్ల వసూళ్లు నిలిచిపోతున్నాయి. ఓటర్లను నొప్పించలేక ఇటు ఖజానా నింపుకోలేక రాజకీయ నేతలు ‘డబుల్ గేమ్’ ఆడుతున్నారు.

News February 17, 2026

BREAKING: మొయినాబాద్‌లో దారుణ హత్య

image

మొయినాబాద్ మండల పరిధిలోని కాశింబౌళిలో రేయిన్‌బో క్రికెట్ గ్రౌండ్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ సహాయంతో కీలక ఆధారాలు సేకరించారు. మృతుడు ఎవరు? పాత కక్షల వల్ల హత్య జరిగిందా? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.