News August 21, 2025
HYD: శిథిలావస్థ భవనాలకు నోటీసులు

GHMC వ్యాప్తంగా శిథిలావస్థ స్థితిలో ఉన్న భవనాలకు అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఎల్బీనగర్ పరిధిలో 113, చార్మినార్ 89, ఖైరతాబాద్ 19, సికింద్రాబాద్ 115, శిరిలింగంపల్లి 52, కూకట్‌పల్లి పరిధిలో 92 భవనాలకు నోటీసులు అందజేశారు. పలు చోట్ల కూల్చివేతలను అధికారులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 24, 2026
సిరిసిల్ల: సర్వే రిపోర్ట్ కోసం ఆశావహుల నిరీక్షణ

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వే సంస్థల రిపోర్ట్ కోసం వివిధ పార్టీల ఆశావహులు నిరీక్షిస్తున్నారు. రిజర్వేషన్ల వెల్లడి అనంతరం సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో అభ్యర్థుల ఎంపిక కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సర్వే సంస్థలపై ఆధారపడ్డాయి. టికెట్ ఆశిస్తున్న నాయకుల అనుకూలతలు, ప్రతికూలతలు తెలపాలంటూ సర్వే సంస్థలను కోరాయి. దీంతో సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి.
News January 24, 2026
సిరిసిల్ల: ‘చిన్న తప్పిదాల కారణంగా భారీ మూల్యం’

వాహనదారులు చిన్న తప్పిదాల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎస్పీ మహేశ్ బి.గితే అన్నారు. సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన ‘Arrive-Alive’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్డుపై పోలీసులు ఉన్నా, లేకున్నా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆటో డ్రైవర్లు ప్రమాదాల సమాచారం అందించాలని తెలిపారు. వాహనాలకు ప్రమాదాల నివారణ సూచనల స్టిక్కర్లు అతికించారు.
News January 24, 2026
గన్నీ బ్యాగుల నిల్వలను పటిష్టంగా భద్రపర్చాలి: అదనపు కలెక్టర్

రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గన్నీ బ్యాగుల నిల్వలను పటిష్టంగా భద్రపర్చాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లాలోని గోడౌన్ మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్ నుంచి జూట్ సరఫరాలో సాంకేతిక ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


