News March 25, 2024
HYD: శిల్పారామంలో మైమరిపించిన నాట్యం

కళాకారులు భరతనాట్య ప్రదర్శనతో సందర్శకులను ఆకట్టుకున్నారు. HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న వారాంతపు కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఐశ్వర్యవల్లి శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శనతో అలరించారు. పుష్పాంజలి, గరుడగమన, పంచమూర్తి కౌతం, జతిస్వరం, గణేశపంచరత్న, చండ్రచూడ శివశంకర, మురళీధర కీర్తనం, దశావతారం, అదివో అల్లదివో తదితర ప్రదర్శనలతో అలరించారు.
Similar News
News December 4, 2025
రంగారెడ్డి: తొలి విడతలో ఆరుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం

రంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో 174 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఆరుగురు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 168 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 530 మంది సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 1,530 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 190 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 1,340 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 3,379 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
News December 3, 2025
REWIND: రంగారెడ్డిలో 135 ఏకగ్రీవం.. రూపాయి రాలేదు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఫిబ్రవరి 2న పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించింది. ఏకగ్రీవ చిన్న పంచాయతీలకు రూ.10లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,185 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 135 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవీ కాలం ముగిసినా ఏకగ్రీవ పంచాయతీలకు ఇంకా పారితోషకం అందలేదు.
News December 2, 2025
RR: ‘రెండో విడత నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి’

గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు అన్ని విధాలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా అధికారిని నడుచుకోవాలని ఆదేశించారు.


