News November 20, 2025
HYD: సందీప్ సూసైడ్‌కు కారణమైన నిందితుల ARREST

సందీప్ చావుకి కారణమైన బాలరాజు, హరీశ్‌ను ఈరోజు జవహర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కాప్రా(M) బాలాజీనగర్‌కు చెందిన బాలరాజు, సందీప్ స్నేహితులు. ఇద్దరు దొంగతనాలు చేస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యారు. వీరిలో సందీప్ తప్పు తెలుసుకుని చెడు స్నేహం మానేశాడు. కోపంతో బాలరాజు మరో మిత్రుడు హరీశ్‌తో కలిసి సందీప్‌ను కొట్టగా మనస్తాపం చెందిన అతడు గత రాత్రి బ్లేడ్‌తో గొంతు కోసుకుని చనిపోయాడు.
Similar News
News January 18, 2026
హైదరాబాద్ మళ్లీ ‘ఆమె’దే!

త్వరలో ఎన్నికలు జరగనున్న జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలిలో మేయర్‌గా మరోసారి మహిళే ఎన్నిక కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ఛైర్మన్లు, మేయర్లకు శనివారం లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. పది మున్సిపల్ కార్పొరేషన్లకు గానూ జీహెచ్ఎంసీకి మహిళ (జనరల్) రిజర్వు కావడంతో రాబోయే పాలకమండలిలోనూ హైదరాబాద్‌లో మహిళే చక్రం తిప్పనున్నారు.
News January 18, 2026
FLASH.. HYD: భార్యను కత్తితో పొడిచిన భర్త

మానవ సంబంధాలు దారి తప్పుతున్నాయి. HYD శివారు, దుండిగల్ PS పరిధి డి.పోచంపల్లిలో డాక్టర్ బస్తీలో దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మద్యానికి బానిసైన భర్త సాదుల్లా, భార్య సాహిని(30)ని తాగడానికి డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News January 18, 2026
HYDలో ఫిబ్రవరి 10 డెడ్‌లైన్

మేయర్, పాలకమండలి గడువు ఫిబ్రవరి 10, 2026తో ముగియనుంది. అప్పటివరకు విలీన మున్సిపాలిటీలు స్పెషల్ ఆఫీసర్ల కింద ఉండనుండగా ఫిబ్రవరి 11 నుంచి గ్రేటర్ వ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయి. మార్చి నాటికి డివిజన్ల వారీ ఫైనల్ రిజర్వేషన్ గెజిట్ విడుదల చేసి, ఏప్రిల్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేలా షెడ్యూల్ సిద్ధమవుతోంది. మున్సిపల్ శాఖ ఇప్పటికే జలమండలి, రెవెన్యూ విభాగాలను దీనికి <<18882564>>అనుగుణంగా<<>> సిద్ధం చేస్తోంది.


