News September 11, 2025

HYD: సచివాలయంలో ఇంటర్నెట్ బంద్

image

సచివాలయంలో ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు శాఖల్లో పనులు స్తంభించాయి. ఉదయం నుంచి ఇంటర్నెట్ నిలిచిపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం నుంచి కేబుల్స్‌ను సిబ్బంది కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 11, 2025

కోస్గి: విజయోత్సవ ర్యాలీలు నిషేధం

image

నారాయణపేట జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు (ఈ నెల 17 వరకు) మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. మొదటి విడత ఎన్నికలు జరిగిన గ్రామాల్లో గెలుపొందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఆయన ప్రకటించారు.

News December 11, 2025

తిరుపతి: ఆలయ ఉద్యోగి ఇంట్లో రూ.10 లక్షల భారీ చోరీ

image

తిరుపతి రూరర్(M) పెరుమాలపల్లి పంచాయతీ, ఎస్‌వీ నగర్‌లో భారీ చోరీ జరిగింది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న డబేదార్ వల్లేటి మురళీమోహన్ ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. రెండు బీరువాలలో ఉన్న రూ.10 లక్షల నగదు, 320 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News December 11, 2025

ములుగు: మొదటి విడత ఎన్నికలో ఓటేసిన 47,472 మంది

image

మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన మూడు మండలాల్లో 60,361 మంది ఓటర్లకు గాను 47,472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో మహిళలు 24,412కాగా.. పురుషులు 23,055, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఏటూరునాగారం మండలంలో 22,279 మందికి గాను 18,043 మంది, గోవిందరావుపేటలో 20,402 మందికి 15,501 మంది, తాడ్వాయిలో 16,680 మంది ఓటర్లకు 13,928 మంది ఓటేశారు.