News April 1, 2024
HYD: సమతామూర్తి సందర్శన వేళల్లో మార్పు

HYD శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో కొలువుదీరిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన వేళలను మార్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చన్నారు. శని, ఆదివారాల్లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు భక్తులు రావచ్చన్నారు. SHARE IT
Similar News
News February 13, 2026
HYDలో ఎయిర్ క్వాలిటీ @194

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ శుక్రవారం తెల్లవారుజామున టీచర్స్ కాలనీలో 194గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News February 13, 2026
HYD: యువతి హత్య.. ఇన్‌ఫార్మర్ అతడే!

మొయినాబాద్‌లో ఆస్తికోసం అన్న, చెల్లి(న్యాయవాది)ని కిరాతకంగా చంపిన కేసులో పోలీసులు కీలక విషయాలు సేకరించారు. ఈ కేసులో శేఖర్ అనే వ్యక్తి స్వప్న అన్న రాజుకు ఇన్‌ఫార్మర్‌గా ఉంటూ కేతిరెడ్డిపల్లి నుంచి సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారంతో రాజు, సందీప్, వీరేశ్, శివలింగం ఆమెను కిరాతకంగా హతమార్చారు. ముందు పొంతనలేని సమాధానం చెప్పినా తర్వాత నిజం ఒప్పుకున్నారు. గురువారం ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు.
News February 13, 2026
రంగారెడ్డి: పుర ‘పోరు’.. నేడే ఫలితాలు

TG వ్యాప్తంగా FEB 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఉమ్మడి రంగారెడ్డిలోని 13 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. ఆమన్‌గల్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, షాద్‌నగర్, శంకర్‌పల్లి, అలియాబాద్, ఎల్లంపేట, మూడుచింతలపల్లి, వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి మున్సిపాలిటీల వారీగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.


