News August 10, 2024

HYD: సయ్యద్ అబ్దుల్ రహీం ఎవరో తెలుసా..?

image

గ్రేటర్ HYD పరిధిలో మలక్‌పేట్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అబ్దుల్ రహీం 1950 నుంచి 1963 వరకు భారత్ ఫుట్ బాల్ టీమ్ కోచ్‌గా వ్యవహరించారు. ఈ కాలం భారత ఫుట్ బాల్ క్రీడకు స్వర్ణ యుగం అని చెప్పవచ్చు. సయ్యద్ అబ్దుల్ రహీం ఫుట్ బాల్ క్రీడకు చేసిన సేవలు ఇతివృత్తంతో ఇటీవల మైదాన్ సినిమా సైతం తీశారు. కాగా తాజాగా ఫుట్ బాల్ మైదానాల ఏర్పాటుకు GHMC రంగం సిద్ధం చేయడంతో మళ్లీ మన HYD ఫుల్‌బాల్ క్రీడలో దూసుకుపోనుంది.

Similar News

News September 19, 2024

HYD: గణనాథుడిని దర్శించుకున్న KTR

image

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా HYD కుషాయిగూడలోని TSIIC కాలనీలో BRS రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో యువసేన యూత్ అసోసియేషన్ వారు భారీ గణనాథుడిని ప్రతిష్ఠించారు. బుధవారం వినాయకుడి ప్రత్యేక పూజలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, ఉప్పల్ నియోజకవర్గ MLA బండారి లక్ష్మారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, BRS పార్టీ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News September 19, 2024

HYD: హృదయవిదారకం.. ప్రాణం తీసిన ఆకలి!

image

హైదరాబాద్ శివారులో బుధవారం హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి తొండుపల్ల మసీదు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. యాచకుడిగా గుర్తించి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆకలితో అలమటిస్తూ ఆ వృద్ధుడు చనిపోయినట్లు‌ తెలుస్తోంది. ఇది విన్న స్థానికులు చలించిపోయారు.

News September 18, 2024

HYD: RTC బస్సు ఢీకొని ఒకరి మృతి

image

RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మున్సిపల్ పరిధి బుల్కాపూర్ వార్డు శివారులో గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. HYD నుంచి శంకర్‌పల్లి వైపు వస్తున్న RTC బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.