News May 21, 2024
HYD: సరస్సుల సంరక్షణ, పునరుజ్జీవనంపై వర్క్‌షాప్

పట్టణ ప్రాంతాల్లో సరస్సుల సంరక్షణ, పునరుజ్జీవనంపై ఈరోజు HYDలో వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో MA&UD ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ పాల్గొని మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో సరస్సుల రక్షణ, పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆరోగ్యకరమైన సరస్సులు అనేక పర్యావరణ ప్రయోజనాలను అందించడమే కాకుండా, అవి మన జీవన నాణ్యతను ప్రభావితం చేస్తాయని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నారు.
Similar News
News March 9, 2026
HYD స్టేడియాలకు మహర్దశ.. లిస్టులో ఇవే!

నగరంలోని వివిధ ప్రాంతాల స్టేడియాలకు మహర్దశ పట్టనుంది. సరూర్‌నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియాలను ఆధునికరించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయా సంబంధిత శాఖకు నేడు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రణాళికలు రచించి వేసవిలో పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News March 9, 2026
హైదరాబాద్ స్ట్రీట్స్ ఇప్పుడు ఫ్యాషన్ అడ్డా!

HYD యువత ఇప్పుడు ఇంటర్నేషనల్ వైబ్స్‌ను మన లోకల్ స్టైల్‌తో కలిపేస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి పాతబస్తీ వరకు గ్లామర్, క్లీన్-గర్ల్ మినిమలిజం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్. ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్, కార్గోలతో హుషారుగా కనిపిస్తూనే మన దేశీ జ్యువెలరీతో ‘ఫ్యూజన్’ క్రేజ్ పుట్టిస్తున్నారు. చిన్న ఆన్‌లైన్ లేబుల్స్, స్నీకర్ల స్టైలింగ్‌తో మన HYD Gen-Z అదరగొట్టేస్తున్నారు. మరి మీ స్టైల్ ఏంటో చెప్పండి?
News March 9, 2026
HYD మెట్రో ‘భారం’.. ఆర్థిక సంక్షోభం!

హైదరాబాద్ మెట్రో మొదటి దశను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఈ మార్చి నాటికి తుది దశకు చేరుతుంది. సుమారు ₹13,000 కోట్ల అప్పులతో పాటు L&Tకి ₹2,000 కోట్ల సెటిల్మెంట్ చెల్లించేలా ఒప్పందం కుదిరింది. PPP మోడల్ విఫలమైందని అడ్మినిస్ట్రేషన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, ప్రభుత్వంపై పడుతున్న ఈ భారీ ఆర్థిక భారం భవిష్యత్తులో సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


