News March 26, 2024

HYD సిటీ బస్సుల సమాచారం.. మీ చేతిలో!

image

HYDలోని సిటీ ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవడం చాలా సులభమని అధికారులు తెలిపారు. కోఠి, రేతి ఫైల్ బస్ స్టేషన్లలో కమ్యూనికేషన్స్ సెంటర్లు ఏర్పాటు చేశామని, సెంటర్లకు కాల్ చేస్తే సమాచారం అందిస్తారని పేర్కొన్నారు. 9959226160, 9959226154 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని తెలియజేశారు. ఇటీవల సిటీలో నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు.

Similar News

News February 10, 2026

HYD: 1,926 సమస్యాత్మక ప్రాంతాలు: DGP

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. 1,926 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామని, హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేశామని, 167 సర్వైలెన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నారన్నారు. పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.

News February 10, 2026

HYD: HCUలో కిటికీ గ్రిల్ తొలగించి ల్యాప్ టాప్ ల చోరీ

image

HCUలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ గ్రిల్ తొలగించి క్లాస్ రూమ్‌లోకి చొరబడి 50 ల్యాప్ టాప్ లను చోరీ చేశారు. భవనంలోని వెనక కిటీకీ గ్రిల్ తొలగించడం, కారు టైర్ల గుర్తులను పోలీసులు గుర్తించారు. యూనివర్సిటీ నలుమూలల ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఘటనపై గచ్చిబౌలి PSలో ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాలరాజు తెలిపారు.

News February 9, 2026

రంగారెడ్డిలో నేటితో గప్ చుప్

image

రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేడు సా.5 గంటలకు ముగియనుంది. దీంతో మైక్‌లు మూగబోనున్నాయి. డప్పుల హోరు.. నేతల ప్రసంగాల జోరుకు బ్రేక్ పడనుంది. కాగా.. ప్రచారానికి ఒక్కరోజే మిగిలి ఉండటంతో ఆదివారం ప్రధాన పార్టీల నేతలు ర్యాలీలతో హోరెత్తించారు. ఆఖరి ఘట్టమైన తాయిలాల పంపిణీకి అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.