News November 20, 2025

HYD: సీఎంను కలిసిన జలమండలి ఎండీ

image

జల సంరక్షణలో జల్ సంచయ్ జన భాగిదారి జాతీయ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఈరోజు HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. జలమండలి దేశంలోని అన్ని మున్సిపాలిటీలతో పోటీపడి అవార్డును సొంతం చేసుకోవడంతో అశోక్ రెడ్డిని సీఎం అభినందించారు. జల సంరక్షణలో జలమండలి చేపడుతున్న కృషికిగాను అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు.

Similar News

News January 16, 2026

కల్వకుర్తిని మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరుతో జిల్లా చేయాలి

image

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరుతో కల్వకుర్తి, ఆమన్‌గల్ కలిపి నూతన జిల్లా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం బీజేపీ రాష్ట్ర నేత ఆచారి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

News January 16, 2026

BIG BREAKING: మేడారంలో క్యాబినెట్ మీటింగ్.. జరిగేది అక్కడే!

image

మేడారంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. కాగా ఈనెల 18న సా.5 గంటలకు మేడారంలోని హరిత హోటల్‌లో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనున్నామని స్పష్టం చేస్తూ తెలంగాణ సీఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులందరూ పాల్గొననున్నారు. కాగా రాజధానిలో కాకుండా తొలిసారిగా ఇతర ప్రాంతంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News January 16, 2026

రూ.200 కోట్ల కలెక్షన్లు దాటేసిన MSVPG

image

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ‘థియేటర్ల లోపల ఈలలు, బయట హౌజ్‌ఫుల్ బోర్డులు.. రూ.200 కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు’ అని రాసుకొచ్చింది. వీకెండ్ కావడంతో రేపు, ఎల్లుండి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.