News November 30, 2025
HYD: సీఎం పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన కవిత

సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి 9 వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. “ఎన్నికలు గ్రామాల్లో ఉంటే, సీఎం జిల్లా కేంద్రాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారట. ప్రజలను ప్రభుత్వ సొమ్ముతో తరలించడం ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమే. ఎన్నికల కమిషన్ సీఎం పర్యటనను నిలిపివేయాలి” అని డిమాండ్ చేశారు.
Similar News
News February 4, 2026
రంగారెడ్డి జిల్లా DEOపై ACBకి ఫిర్యాదు!

రంగారెడ్డి జిల్లా DEO సుశీందర్రావు ఆస్తిపాస్తుల, ఆదాయ వ్యయాలపై వెంటనే పూర్తి సమగ్ర విచారణ చేయాలని తెలంగాణ BC సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ACBకి ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లాలోని అందరూ MEOలు, DEO ఆఫీసులో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న బాదం వెంకటేశ్, లక్ష్మీనరసింహులు ఆస్తులపైనా సమగ్ర విచారణ చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
News February 4, 2026
మహిళా పారిశ్రామికవేత్తలకు డిజిటల్ సాధికారత

GHMC, MEPMA- ISB సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సూక్ష్మ పారిశ్రామిక వేత్తలకు డిజిటలైజేషన్, వ్యాపార సామర్థ్య పెంపుపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 400 మంది మహిళలకు వాట్సాప్ బిజినెస్, ఇన్స్టాగ్రామ్ స్టోర్‌ఫ్రంట్స్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. సూక్ష్మ రుణాల లభ్యత, మార్కెటింగ్ మెళకువలతో మహిళా స్వయం ఉపాధి రంగాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
News February 4, 2026
RR: మున్సిపల్ బరిలో 437 మంది అభ్యర్థులు

మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది.126 వార్డుల్లో మొత్తం 615 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అందులో 178 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో 437 మంది అభ్యర్థులు ఉన్నారు. అందులో కాంగ్రెస్ 126, బీఆర్ఎస్ 122, బీజేపీ 109, బీఎస్పీ 3, CPI(M) 2, MIM 1, AIFB2, సీపీఐ 2, జనసేన 9, ఇండిపెండెంట్ 57, ఇతరులు నలుగురు బరిలో ఉన్నారు.


