News April 28, 2024

HYD: సూపర్‌హీరో‌కు CM రేవంత్ రెడ్డి సన్మానం

image

సూపర్‌హీరో‌ సాయి‌చరణ్‌‌ సాహసం పట్ల‌ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. HYD శివారు నందిగామ‌లోని ఓ ఫార్మా కంపెనీ‌లో ఈ నెల 26న భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్మికు‌లను పదో తరగతి బాలుడు సాయిచరణ్ రిస్క్‌ చేసి కాపాడారు. ఆదివారం‌ స్థానిక MLA వీర్లపల్లి శంకర్‌ బాలుడిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి శాలువా కప్పి అతడిని అభినందించారు.

Similar News

News April 20, 2026

HYD: పిల్లలు కలగటం లేదా? ఇక్కడికి రండి

image

పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగక దిగులు చెందుతున్నారా? ఆ చింతన వదిలేయండి. నమ్మకంతో HYD గాంధీ ఆస్పత్రిలో IVF(సంతాన సాఫల్య కేంద్రానికి) రావాలని డా.ఇందిరా సూచిస్తున్నారు. అద్భుతమైన చికిత్స అందిస్తున్నామని, IVF సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి సుమారుగా 40 శాంపిల్స్ సేకరించి, 17 మందికి IVF వైద్యం ప్రారంభించినట్లుగా ఆమె తెలిపారు. వీరిలో ఏడుగురికి పాజిటివ్ ఫలితం వచ్చిందన్నారు.
#SHARE IT

News April 20, 2026

HYD: ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఇదే!

image

HYDలో ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు MMTSలో ‘జీరో ఫేర్’ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. టికెట్ ఉచితం చేస్తే ప్రయాణికుల సంఖ్య రోజుకు 1.2 లక్షలకు చేరుతుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం MMTS ద్వారా ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయమే వస్తోంది. ఈ స్వల్ప మొత్తాన్ని ప్రభుత్వమే భరించి, ప్రజలను మళ్లీ రైలు ప్రయాణం వైపు మళ్లించడం ద్వారా రోడ్లపై రద్దీని తగ్గించవచ్చని సర్కార్ భావిస్తోంది.