News November 20, 2025

HYD: సౌదీలో మృతదేహాలకు రేపు అంత్యక్రియలు: అజహరుద్దీన్

image

సౌదీలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి రేపు అంత్యక్రియలు చేయనున్నట్లు మైనారిటీ శాఖ మంత్రి అజహరుద్దీన్ తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ మంత్రి అజహరుద్దీన్, ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ సౌదీ అధికారులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా మృతుల కుటుంబసభ్యులు సైతం సౌదీకి చేరుకున్నారు.

Similar News

News January 20, 2026

‘జారుతున్న బతుకులు’.. గౌడన్నల గోసపై ప్రత్యేక కథనం

image

తిర్యాణి మండలంలో సుమారు 500 గౌడ కుటుంబాలు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. మండలంలో కొన్ని ప్రాంతాలు ఏజెన్సీలో ఉండడంతో ఇక్కడ జీవిస్తున్న గీత కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదు. ఎత్తయిన తాడి చెట్ల నుంచి జారుతూ పిట్టలా రాలిపోతున్నా తమను పట్టించుకునే వారే లేరని గౌడ కుటుంబాలు వాపోతున్నాయి. ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గౌడ కులస్థులను ఆదుకోవాలని గీత కార్మికులు కోరుతున్నారు.

News January 20, 2026

జోగి సోదరులకు బెయిల్

image

AP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముకు బెయిల్ మంజూరైంది. భవానీపురంలో నమోదైన కేసులో బెయిల్ లభించగా, మొలకలచెరువు కేసులో ఆయన రిమాండ్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

News January 20, 2026

4 గంటలుగా కొనసాగుతున్న హరీశ్ విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పీఎస్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ కొనసాగుతోంది. సుమారు 4 గంటలకుపైగా సిట్ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రైవేటు ఛానెల్ ఎండీ స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి హరీశ్ కూడా దీటుగా సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. అటు మాజీ మంత్రి విచారణపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.