News July 4, 2024

HYD: స్టెరాయిడ్స్‌తో ఆరోగ్య సమస్యలు!

image

HYD, ఉమ్మడి RRలో యువత ఆసక్తిని కొన్ని జిమ్ సెంటర్లు ఆసరాగా చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. త్వరగా సిక్స్ ప్యాక్స్ రావాలన్నా, లావు తగ్గాలన్నా, ఎక్కువ సేపు జిమ్ చేయాలన్నా నిషేధిత స్టెరాయిడ్స్‌ వాడాలని కొందరు కోచ్‌లు చెప్పడం గమనార్హం. ఇటీవల మెహదీపట్నంలో ఓ యువకుడు నిషేధిత ఇంజక్షన్ తీసుకుని కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు.పాతబస్తీలో ఈ ఇంజక్షన్లు, మాత్రలు అమ్మే కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News December 13, 2025

HYD: ప్రముఖుల బసకు చిరునామా.. ఫలక్‌నుమా

image

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈరోజు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. దీని కోసం హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీకి ప్రభుత్వం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బస ఏర్పాటు చేసింది. ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రముఖులు బస చేసేందకు చిరునామాగా మారింది. దీన్ని 1893లో నిర్మించగా.. 1895 నుంచి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గెస్ట్ హౌస్‌గా వాడేవారు. ప్రస్తుతం తాజ్ గ్రూప్ ప్యాలెస్‌ను లీజ్ తీసుకుంది.

News December 13, 2025

హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు

image

హైదరాబాద్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. అత్యంత కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ప్రజలు వణుకుతున్నారు. గత వారం రోజుల్లో అత్యల్పంగా సగటున 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, రాత్రి పొగ మంచు ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

News December 13, 2025

రేవంత్‌ vs KTR: హైదరాబాదీలకు నిరాశ!

image

HYDకు తలమానికంగా రూ.75 కోట్లతో HMDA అభివృద్ధి చేసిన కొత్వాల్‌గూడ ఈకో పార్క్ ఇప్పుడు రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఈ పార్కు ఓపెనింగ్‌‌ను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని KTR విమర్శించారు. DEC 9న CM చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన పార్క్.. KTR విమర్శల కారణంగానే వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల కొట్లాటలో దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం వంటి అద్భుతాలు చూడాలనుకున్న HYD ప్రజలకు నిరాశే మిగిలింది.