News March 31, 2024
HYD: హత్య చేసి మృతదేహాన్ని పడేసే యత్నం..!

HYD శివారు చేవెళ్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. షాద్‌నగర్ వాసి మహమ్మద్(50) చేవెళ్లలోని CPI కాలనీలో ఉంటున్నాడు. అతడిని కొందరు హత్య చేసి, కాళ్లను కట్టేసి, ఓ మూటలో చుట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేసే ప్రయత్నం చేశారు. స్థానికులు వారిని గమనించి పెద్దగా అరిచారు. దీంతో మృతదేహాన్ని వదిలేసి వారు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేశారు.
Similar News
News February 13, 2026
HYD: యువతి హత్య.. ఇన్‌ఫార్మర్ అతడే!

మొయినాబాద్‌లో ఆస్తికోసం అన్న, చెల్లి(న్యాయవాది)ని కిరాతకంగా చంపిన కేసులో పోలీసులు కీలక విషయాలు సేకరించారు. ఈ కేసులో శేఖర్ అనే వ్యక్తి స్వప్న అన్న రాజుకు ఇన్‌ఫార్మర్‌గా ఉంటూ కేతిరెడ్డిపల్లి నుంచి సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారంతో రాజు, సందీప్, వీరేశ్, శివలింగం ఆమెను కిరాతకంగా హతమార్చారు. ముందు పొంతనలేని సమాధానం చెప్పినా తర్వాత నిజం ఒప్పుకున్నారు. గురువారం ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు.
News February 13, 2026
రంగారెడ్డి: పుర ‘పోరు’.. నేడే ఫలితాలు

TG వ్యాప్తంగా FEB 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఉమ్మడి రంగారెడ్డిలోని 13 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. ఆమన్‌గల్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, షాద్‌నగర్, శంకర్‌పల్లి, అలియాబాద్, ఎల్లంపేట, మూడుచింతలపల్లి, వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి మున్సిపాలిటీల వారీగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.