News September 11, 2025

HYD: హైకోర్టులో నల్లా బాలుకు ఊరట.. KTR హర్షం

image

సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లా బాలుపై కాంగ్రెస్ పెట్టిన 3 కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. రాజకీయ ప్రేరేపిత కేసులతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధించడం ఆపాలి’ అని డీజీపీని కోరారు. కేసులో విజయం సాధించినందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్‌కు అభినందనలు తెలిపారు.

Similar News

News December 9, 2025

వాయువేగంతో ‘గ్రేటెస్ట్ హైదరాబాద్‌’.. స్పష్టత ఏది?

image

GHMCలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ల <<18508761>>విలీనం<<>> వాయువేగంతో పూర్తైంది. 150 డివిజన్లతో ఉన్న GHMC.. 27 ULBs కలిశాక 12 జోన్లు, 300డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో (నం.266) విడుదల చేసింది. పెరుగుతున్న నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వార్డులు డబుల్ చేయాలని కమిషనర్ పంపిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే..మమ్మల్ని GHMCలో ఎందుకు కలిపారో చెప్పడంలేదెందుకని శివారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

News December 9, 2025

గ్లోబల్ సమ్మిట్: టెక్నాలజీ గుప్పిట్లో ‘ప్రగతి’ లక్ష్యాలు!

image

TG గ్లోబల్ సమ్మిట్‌లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGs) సంచలనం సృష్టించాయి. ఫ్యూచరిస్టిక్ డోమ్‌లో ఈ 17 లక్ష్యాలను అద్భుతంగా ప్రదర్శించడం రాష్ట్ర ప్రభుత్వ ‘విజన్ 2047’కు అద్దం పట్టింది. వృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో సాగాలనే స్పష్టమైన సందేశాన్నిస్తూ, సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధిని ముడిపెట్టే ఈ ప్రదర్శన సమ్మిట్‌కు వచ్చిన ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకర్షించింది.

News December 9, 2025

HYD: గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ సంస్కృతి, రుచులకు పెద్దపీట

image

హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌లో విదేశీ అతిథులను మంత్రముగ్ధులను చేసేందుకు తెలంగాణ సంస్కృతి, రుచులకు పెద్దపీట వేశారు. శక్తివంతమైన గుస్సాడీ, బోనాలు, పేరిణి శివతాండవం వంటి నృత్యాలను ప్రదర్శిస్తున్నారు. అతిథులకు ప్రత్యేకంగా ‘తెలంగాణ మెనూ’ను సిద్ధం చేశారు. ఇందులో సకినాలు, సర్వపిండి, దమ్ బిర్యానీ, హలీమ్ వంటి సాంప్రదాయ వంటకాలు ఉన్నాయి.