News March 14, 2025
HYD: హోలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత: సీపీ

35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం ఒకేరోజు రావడంతో HYD సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రతీ జోన్, సున్నితమైన ప్రాంతాల్లో పికెట్‌లు ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ చైతన్య కుమార్ పాల్గొన్నారు.
Similar News
News February 9, 2026
394 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News February 9, 2026
గొర్రె, మేక పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.
News February 9, 2026
కృష్ణా: మూగబోయిన టీడీపీ ఫైర్ బ్రాండ్స్.. ఏమైంది నాయకా..?

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నుంచి తిరుమల లడ్డూ కల్తీ వరకు YCP చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతలు వెనుకబడ్డారని చర్చ సాగుతోంది. కొలికిపూడి, బోండా ఉమా, బోడె ప్రసాద్ వంటి ఫైర్ బ్రాండ్ నేతలు కూడా గట్టిగా స్పందించకపోవడంపై TDP
క్యాడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు జనసేన నేతలు కూడా మౌనం వహించడంతో YCPకి దీటైన సమాధానం ఇవ్వలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది.


