News November 12, 2025

HYD: ఒక్క నెలలో రూ.13 కోట్లు తగ్గిన ఎకరం!

image

రియల్‌ ఎస్టేట్‌ రంగం ఇటీవల కాలంలో మందగమనంలోకి వెళ్లిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తాజాగా టీజీఐఐసీ నిర్వహించిన రాయదుర్గ్‌ పాన్‌మక్తా భూముల వేలంలో ఎకరాకు రూ.164 కోట్లు మాత్రమే పలకడం వివాదాస్పదంగా మారింది. గత నెలలో ఇదే ప్రాంతంలో ఎకరాకు రూ.177 కోట్లు వచ్చినప్పటికీ, ఒక్క నెలలోనే రూ.13 కోట్ల తేడా రావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ధరల వ్యత్యాసం వెనుక రాజకీయ ప్రభావం ఉందా? అనే చర్చ నడుస్తోంది.

Similar News

News November 12, 2025

జీరో బడ్జెట్‌తో సోలో ట్రావెలింగ్

image

అమ్మాయి ఒంటరిగా బయటకువెళ్తే సేఫ్‌గా వస్తుందా రాదా అనే పరిస్థితే ఇప్పటికీ ఉంది. కానీ తమిళనాడుకు చెందిన సరస్వతి నారాయణ అయ్యర్‌ ఒంటరిగా, జీరో బడ్జెట్‌తో దేశమంతా తిరిగేస్తూ ఫేమస్ అయ్యింది. తక్కువ లగేజ్‌, వెళ్లాల్సిన దారిలో లిఫ్ట్‌ అడగడం, కిలోమీటర్ల కొద్దీ కాలినడకన ప్రయాణం సాగిస్తూ ఈమె బడ్జెట్ సోలో ట్రావెలింగ్ చేస్తోంది. తన అనుభవాలను వివరిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పెడుతూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

News November 12, 2025

HYD: రోడ్లపై రేగే దుమ్ము వల్లే 32% పొల్యూషన్..!

image

HYD నగరంలో సూక్ష్మ ధూళికణాల కారణంగా జరుగుతున్న కాలుష్యంపై ఐఐటీ కాన్పూర్ ప్రత్యేకంగా స్టడీ చేసింది. అయితే రోడ్లపై రేగే దుమ్ము కారణంగానే 32% పొల్యూషన్ జరుగుతుందని, వాహనాల ద్వారా 18%, ఆర్గానిక్ పదార్థాల వల్ల 16%, బర్నింగ్ బయోమాస్ వల్ల 11 శాతం జరుగుతున్నట్లు తెలిపింది. పరిశ్రమల వల్ల 5 శాతం పొల్యూషన్ జరుగుతుందని పేర్కొంది.

News November 12, 2025

కరీంనగర్: గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

KNR జిల్లా తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో సీసీటీవీ సర్వీసింగ్ & ఇన్స్టాలేషన్ లో నిరుద్యోగుల నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SBI RSETI సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18-45సం. పురుషులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు Nov12లోపు దరఖాస్తు చేసుకోవాలని, Nov 13 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు.