News November 12, 2025
HYD: గాంధీ విగ్రహాల సేకరణ ప్రచార రథం ప్రారంభం

గాంధీభవన్‌లో గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాపన స్వర్ణోత్సవాల సందర్భంగా చేపట్టిన ‘ఒక అడుగు- లక్ష గాంధీజీ విగ్రహాలు’ కార్యక్రమానికి ప్రచార రథాన్ని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన గాంధీజీ విగ్రహం ప్రతిష్ఠాపనకు పూనుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 12, 2025
HYD: రాష్ట్రంలో కాంగ్రెస్‌కి ఢోకా లేదు: TPCC

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, టీపీసీసీగా తామే ఉంటామని చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామని, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై స్టడీ చేస్తామన్నారు. కాంగ్రెస్ మరో 10ఏళ్లు అధికారంలో ఉంటుందని, ఏ ఎలక్షన్ వచ్చినా గెలిచేది కాంగ్రెస్ అన్నారు.
News November 12, 2025
HYD: డ్రగ్ కేసులో నైజీరియన్ డిపోర్టేషన్

హైదరాబాద్ H-NEW పోలీసులు డ్రగ్ కేసులో నైజీరియన్ ఒన్యేవుకూ కెలెచి విక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా భారత్‌లో ఉండి డ్రగ్ సరఫరాలో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. FRRO సహకారంతో అతడిని డిపార్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నైజీరియన్స్ అనుమానాస్పదంగా కనబడితే తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
News November 12, 2025
FLASH: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈరోజు అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడు సలీంను (DRI) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతడి బ్యాగులో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, సలీంను అదుపులోకి తీసుకున్న అధికారులు, నిషేధిత వస్తువులను సీజ్ చేశారు.


