News November 1, 2025

HYD: చంద్రబాబు ఫొటోతో ప్రచారం.. కాంగ్రెస్ VS BJP

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబు ఫొటోలు, TDP జెండాలు దర్శనమిస్తున్నాయి. ఇటీవల BJP ర్యాలీలో TDP జెండాలు కనిపించగా తాజాగా కాంగ్రెస్ ర్యాలీలో చంద్రబాబు ఫొటో కనిపించింది. అయితే కాంగ్రెస్ నేతలపై సరూర్‌నగర్ BJP కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ NDA మిత్రపక్ష నేత, AP CM చంద్రబాబు ఫొటోను కాంగ్రెసోళ్లు వినియోగించడం సిగ్గు చేటన్నారు.ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Similar News

News November 2, 2025

మోడల్ సోలార్ విలేజ్‌గా బిక్కనూర్

image

కామారెడ్డి జిల్లాలో పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకంలో భాగంగా మోడల్ సోలార్ విలేజ్‌ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ పరిశీలన అనంతరం బిక్కనూర్‌ను జిల్లాలోని మోడల్ సోలార్ గ్రామంగా ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా దేశంలోని ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని స్థాపించడం లక్ష్యంగా పెట్టుకున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 2, 2025

రేపటి నుంచి కాలేజీల బంద్!

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకోకపోతే రేపట్నుంచి బంద్‌‌కు దిగుతామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య అల్టిమేటం జారీ చేసింది. దసరాకు ముందే రూ.1,200CR విడుదల చేస్తామని చెప్పి రూ.300CR రిలీజ్ చేశారని తెలిపాయి. ఫీజు బకాయిలు చెల్లించేవరకు కాలేజీలు తెరవబోమని, ఈ నెల 6న లక్షన్నర మందితో HYDలో సభ నిర్వహిస్తామని చెప్పింది. దీంతో ప్రభుత్వం ఇవాళ ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి.

News November 2, 2025

AVNLలో 98 పోస్టులు…అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

చెన్నైలోని ఆర్మ్‌డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్(AVNL) హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో 98 కాంట్రాక్ట్ జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, NAC/NTC/STC ట్రేడ్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBD, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.