News November 13, 2025
HYD: చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం కాదు

చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం ఒక్కటే కాదని.. దాని అవసరాలు నెరవేరే విధంగా వాటిని తీర్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శిల్పకళా వేదికలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వహించిన సౌత్ ఇండియా CSR సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CSR నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా ఆయా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 13, 2025
15న ఉమ్మడి మెదక్ జిల్లా నెట్ బాల్ సెలక్షన్స్

ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-14,17 బాల, బాలికల ‘నెట్ బాల్ ‘ సెలక్షన్స్ నిర్వహిస్తున్నామని సిద్దిపేట జిల్లా SGF సెక్రటరీ సౌందర్య తెలిపారు. ఈనెల 15న ప్రజ్ఞాపూర్ ZPHS, బాయ్స్ స్కూల్‌లో సెలక్షన్స్ ఉంటాయన్నారు. విద్యార్థులు ఒరిజినల్, ఆధార్, బోనాఫైడ్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 99639 96911 ఫోన్ నంబర్ కు సంప్రదించాలన్నారు.
News November 13, 2025
శుభ సమయం (13-11-2025) గురువారం

✒ తిథి: బహుళ నవమి తె.3.31 వరకు
✒ నక్షత్రం: మఖ రా.12.15 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.1.30-మ.3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-మ.3.36
✒ వర్జ్యం: మ.12.13-మ.1.49
✒ అమృత ఘడియలు: రా.9.49-రా.11.25
News November 13, 2025
మెదక్: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు: కలెక్టర్

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. బుధవారం ఛాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణం కొనుగోళ్లకు అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు.


