News November 12, 2025

HYD: జావా కోడింగ్‌పై 4 రోజుల FREE ట్రైనింగ్

image

బాలానగర్‌లోని CITD కేంద్రంలో 4రోజుల జావా కోడింగ్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వన్నున్నట్లు CDAC బృందం ప్రకటించింది. ఐటీఐ ఫ్యాకల్టీ, పాలిటెక్నిక్ కాలేజీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ప్రొఫెషనల్స్ STEM సబ్జెక్టులు బోధించే వారికి ఇది సువర్ణ అవకాశంగా పేర్కొన్నారు. జావా కోడింగ్‌పై పట్టు సాధించాలని అనుకున్నవారు, నవంబర్ 20 సా.5 గంటలలోపు tinyurl.com/mvutwhub లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.

Similar News

News November 12, 2025

GNT: ఫోన్ కోసం యువకుడి ఆత్మహత్య..!

image

అప్పులు చేసి ఫోన్లు కొనడం, మద్యం మత్తులో వాటిని పగలకొట్టడంతో తల్లిదండ్రులు మందలించారని డేరంగుల అంజి (19) ఎలుకల మందుతిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ఆర్ కాలనీకి చెందిన అంజి రెండు ఫోన్లను పగలకొట్టాడు. మరోఫోన్ అడగడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఈ నెల 2న కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని పోలీసులు తెలిపారు.

News November 12, 2025

అయోడిన్ లోపంతో పిల్లల్లో ఎదుగుదల సమస్యలు

image

థైరాయిడ్ హార్మోన్లు, ట్రైయోడోథైరోనిన్ (T3), థైరాక్సిన్ (T4) సరైన మోతాదులో విడుదల కావడానికి అయోడిన్ చాలా అవసరం. అయితే అయోడిన్‌ లోపాలున్న పిల్లలు అత్యధికంగా దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే 82.5% ఉన్నట్లు చిల్డ్రన్ ఇన్ ఇండియా నివేదిక తెలిపింది. దీనిలోపంతో పిల్లల్లో ఎదుగుదల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చేపలు, సముద్ర ఆహారం, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల్లో అయోడిన్‌ అధికంగా ఉంటుంది.

News November 12, 2025

ఏలూరు: SSC పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల

image

2025–26 విద్యా సంవత్సరానికి SSC పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటలక్షమ్మ పేర్కొన్నారు. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ నవంబర్ 25గా నిర్ణయించారు. ఆలస్య రుసుం రూ.50, రూ.200, రూ.500 చొప్పున డిసెంబర్ 3, 10, 15 వరకు చెల్లించవచ్చన్నారు. మరిన్ని వివరాల కొరకు www.bse.ap.org చూడాలన్నారు.