News November 12, 2025

HYD: జావా కోడింగ్‌పై 4 రోజుల FREE ట్రైనింగ్

image

బాలానగర్‌లోని CITD కేంద్రంలో 4రోజుల జావా కోడింగ్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వన్నున్నట్లు CDAC బృందం ప్రకటించింది. ఐటీఐ ఫ్యాకల్టీ, పాలిటెక్నిక్ కాలేజీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ప్రొఫెషనల్స్ STEM సబ్జెక్టులు బోధించే వారికి ఇది సువర్ణ అవకాశంగా పేర్కొన్నారు. జావా కోడింగ్‌పై పట్టు సాధించాలని అనుకున్నవారు, నవంబర్ 20 సా.5 గంటలలోపు tinyurl.com/mvutwhub లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.

Similar News

News November 12, 2025

జూబ్లీహిల్స్ EXIT POLLS.. BRS, కాంగ్రెస్‌ వార్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో మంగళవారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌పై BRS, కాంగ్రెస్ నేతల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. చాణక్య స్ట్రాటజీస్, HMR,నాగన్న, జనమైన్, స్మార్ట్ పోల్,ఆరా మస్తాన్ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని వెల్లడించగా మిషన్ చాణక్య, క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ BRS గెలుస్తుందని చెప్పాయి. దీంతోNOV 14న దేఖ్లేంగే అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. మీ కామెంట్?

News November 12, 2025

జూబ్లీహిల్స్‌‌‌ బైపోల్.. కాయ్ రాజా కాయ్..!

image

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లకు పండుగలా మారింది. HYD, ఉమ్మడి RRలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని మిగితా జిల్లాల్లోనూ గెలుపోటములపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. దీనిపై రూ.వేల నుంచి రూ.లక్షల్లో బెట్టింగ్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు మొబైల్ యాప్‌లలో, మరి కొందరు వాట్సాప్ గ్రూపుల్లో పందేల వివరాలపై చాటింగ్ జరుపుతున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం NOV 14న వెలువడనుంది.

News November 12, 2025

జూబ్లీహిల్స్: ప్రచారం ఫుల్.. పోలింగ్ నిల్..!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో రెండు వారాల పాటు ప్రధాన పార్టీలు ఫుల్ జోష్‌గా ప్రచారం చేశాయి. సీఎం సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ పార్టీల కీలక నేతల రోడ్ షోలు,ర్యాలీలు, డైలాగ్‌లు,మాటల తూటాలు, ఆరోపణలతో ఒక్కసారిగా స్టేట్ పాలిటిక్స్ వేడెక్కాయి. అయితే ఇంత చేసినా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో అటు పార్టీలతోపాటు ఇటు ఎన్నికల అధికారులు వెనకబడ్డారు. 48.49% పోలింగ్ జరిగింది.