News November 12, 2025
HYD: టీజీ సెట్-2025 డిసెంబర్ 10 నుంచి ప్రారంభం

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG SET-2025) డిసెంబర్ 10, 11, 12వ తేదీల్లో మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు ప్రకటించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం ఈ పరీక్షను 29 సబ్జెక్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లు డిసెంబర్ 3 నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
Similar News
News November 12, 2025
HYD: సీఐడీ విచారణకు సినీ నటులు

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ విచారణ వేగం పెంచింది. నిన్న నటుడు విజయ్ దేవరకొండను ప్రశ్నించిన అధికారులు, నేడు నటుడు ప్రకాశ్‌రాజ్‌ను విచారణకు పిలిపించారు. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రమోషన్ వివరాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. గత 10 రోజుల క్రితం సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.
News November 12, 2025
చైనాలో మెడిసిన్ చదివి.. HYDలో హోటల్ వ్యాపారం చేసి..!

గుజరాత్‌లో పట్టుబడ్డ ఐసీస్ సానుభూతి పరుడైన హైదరాబాద్ వైద్యుడు మొహియుద్దీన్ చైనాలో మెడిసిన్ చదవినట్లు తెలుస్తోంది. ఖమ్మంకు చెందిన ఇతడికి ఇక్కడ ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో 2007 నుంచి 2013 వరకు చైనాలో ఎంబీబీఎస్ చేశాడు. ఆ తర్వాత HYD వచ్చి పనిచేసినా డాక్టర్ జాబ్‌కు స్వస్తి చెప్పాడు. అనంతరం ఓ హోటల్ వ్యాపారంలోకి దిగి ఐసిస్‌తో పరిచయాలు పెంచుకొని ప్రమాదకర విష రసాయనం రెసిన్ తయారు చేయడం ప్రారంభించాడు.
News November 12, 2025
HYD: సత్యసాయి భక్తులకు గుడ్ న్యూస్

సత్యసాయిబాబా భక్తులకు ఆర్టీసీ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. ఈనెల 23న పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలకు వెళ్లే గ్రేటర్ HYD వాసులకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నామన్నారు. ఈనెల 22న సాయంత్రం బస్సు బయలుదేరుతుంది. వేడుకలు ముగిసిన అనంతరం 23న సాయంత్రం పుట్టపర్తి నుంచి సిటీకి బయలుదేరుతుందని డిపో-1 మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. 73828 24784 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.


