News November 12, 2025
HYD: మీర్ ఆలం ట్యాంక్‌పై ఐకానిక్ కేబుల్ వంతెనకు CM గ్రీన్ సిగ్నల్

మూసీ పునరుజ్జీవంలో భాగంగా శాస్త్రిపురం వద్ద మీర్ ఆలం ట్యాంక్‌పై చింతల్‌మెట్‌తో అనుసంధానమయ్యే 2.5 కి.మీ పొడవైన కేబుల్-స్టేడ్ వంతెన నిర్మాణానికి CM రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రూ.319 కోట్ల వ్యయంతో KNR కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును EPC మోడల్‌లో నిర్మించనుంది. వంతెన డిజైన్ దుర్గం చెరువు వంతెన కంటే అద్భుతంగా ఉండనుంది. నీటి వనరుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయనుంది.
Similar News
News November 12, 2025
GHMC వ్యాప్తంగా అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టం

గ్రేటర్ HYD వ్యాప్తంగా GHMC ఆధ్వర్యంలో అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టం ఆవిష్కరించింది. ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్, ట్యాబ్, ఎలక్ట్రానిక్ ప్రింటర్లు, జిరాక్స్ యంత్రాలను అధికారులకు అందించినప్పుడు వాటిని గతంలో నమోదు చేయకపోవడంతో గందరగోళం ఏర్పడేది. ఇప్పుడు వాటన్నింటి వివరాలు నమోదు చేసి, ఎప్పటికప్పుడు ప్రత్యేక సిస్టం ద్వారా పర్యవేక్షిస్తారు. ప్రతి దానికి సంబంధించి లెక్కలు పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టారు.
News November 12, 2025
HYD: అర్ధనగ్నంగా హిజ్రాలు.. పోలీసుల WARNING

గ్రేటర్ HYDలో హిజ్రాల ఆగడాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఫంక్షన్ చేయాలన్నా వీళ్లతో భయమైతుందని వాపోతున్నారు. తాజాగా HYD-శ్రీశైలం హైవేపై రాత్రిళ్లు హిజ్రాలు అర్ధనగ్నంగా తిరుగుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వాహనదారులు ఫిర్యాదు చేయడంతో పహాడీషరీఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అరెస్ట్ చేసి, సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
News November 12, 2025
రంగారెడ్డి: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 13న ఇంటర్వ్యూ

నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌లో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా DMHO లలితాదేవి తెలిపారు. రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఈనెల 13న ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని, MBBS పూర్తి చేసిన వారు దరఖాస్తు ఫారంతో పాటు బయోడేటా, జిరాక్స్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్లు తీసుకురావాలన్నారు.


