News November 30, 2025
HYD: రేపు విలీనం.. రంగం సిద్ధం?

ORR పరిధిలోని 20 పట్టణాలు, 7 నగరాలను GHMCలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతమైంది. ఈ మహాత్తర పునర్వ్యవస్థీకరణ కోసం అధికారులు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. డిసెంబర్ 1న ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. విలీన ప్రక్రియ పూర్తి కాగానే ఈ స్థానిక సంస్థలు GHMC కమిషనర్ అధీన పరిపాలనా వ్యవస్థలోకి సమీకృతం కానున్నాయి. తదుపరి పాలన GHMC 1995 చట్టం ప్రతిపత్తిలో కొనసాగనుంది.
Similar News
News December 2, 2025
ఉచితంగా క్రికెట్ మ్యాచులు చూసే అవకాశం

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ మ్యాచులను ఫ్రీగా చూసేందుకు అభిమానులను అనుమతిస్తున్నారు. స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, షమీ, హర్షల్ పటేల్‌తో పాటు పలువురు ప్లేయర్లు ఈ సిరీస్‌లో ఆడుతున్నారు. ఉప్పల్‌తో పాటు జింఖానా, ఎల్బీ స్టేడియాల్లో మ్యాచులు జరుగుతున్నాయి. షెడ్యూల్ <
News December 2, 2025
నల్గొండ: సెటిల్‌మెంట్ల కోసం నామినేషన్లు..?

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండలో కొందరు ప్రజా సేవ చేద్దామని నామినేషన్లు వేస్తుంటే మరికొందరేమో ఇదే అదునుగా దందా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు కావాలని నామినేషన్లు వేసి, ప్రధాన పోటీదారులతో మాట్లాడుకుంటున్నారు. కొంత డబ్బు తీసుకుని విత్‌డ్రా చేసుకుని, సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలను సైతం చివరకు దందా చేశారని పలువురు మండిపడుతున్నారు.
News December 2, 2025
భద్రాద్రి: రెండో రోజు అందిన నామినేషన్ వివరాలు

గ్రామపంచాయతీ ఎన్నికల 2వ విడతలో 7 మండలాల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. 2వ రోజు సోమవారం మండలాల వారీగా అందిన సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ వివరాలు.. అన్నపురెడ్డిపల్లి – 8, 6, అశ్వారావుపేట – 15, 13, చండ్రుగొండ – 9, 8, చుంచుపల్లి – 14, 13, దమ్మపేట – 19, 19, ములకలపల్లి -13, 13, పాల్వంచ -22, 18, మొత్తం సర్పంచ్ 100, వార్డు సభ్యులకు 90 నామినేషన్లు వచ్చాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.


