News November 12, 2025

HYD: రేపే ఫీజు చెల్లింపు లాస్ట్..!

image

HYD డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2019- 2024 మధ్య చేరిన డిగ్రీ 1st, 3rd ఇయర్ విద్యార్థులు ఇంకా ట్యూషన్ ఫీజు చెల్లించని వారు NOV 13లోపు చెల్లించొచ్చని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే 2022- 2024 మధ్య MA, MCom, MSc అడ్మిషన్ పొందిన వారూ 2nd ఇయర్ ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చని వివరించారు. పూర్తి వివరాలకు www.braouonline.inను సందర్శించండి.

Similar News

News November 12, 2025

NGKL: ‘దర్శన యాత్ర.. ఫోన్ చేయండి!’

image

NGKL డిపో నుంచి అన్నవరం, పంచారామ క్షేత్రాల దర్శన యాత్రకు సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య ‘Way2News’తో తెలిపారు. ఈనెల 14న రాత్రి యాత్ర ప్రారంభం కానుంది. 15న అమరేశ్వరుని దర్శనం, భీమవరం, ద్రాక్షారామం, పంచారామాలు, 16న అన్నవరం వ్రతాలు, మంగళగిరి, విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కల్పిస్తారు. 17న తిరుగు ప్రయాణం. ఛార్జీ రూ.3,000. వివరాలకు 94904 11590, 94904 11591 సంప్రదించాలని అన్నారు.

News November 12, 2025

బైక్ అదుపుతప్పి యువకుడు మృతి

image

డుంబ్రిగూడ మండలం కురిడి వద్ద బైక్ అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని కురిడి రైల్వే గేట్ వద్ద యువకుడు నడుపుతున్న బైక్ అదుపు తప్పింది. ఈ ఘటనలో విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 12, 2025

తిరుపతి: ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

image

తిరుపతి జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాలపేట మండలం తడుకు రైల్వే స్టేషన్ సమీపంలో తిరుపతి-చెన్నై హైవేపై నడిచి వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ ఇద్దరూ చనిపోయారు. మృతులు విజయపురం మండలం KVపురం గ్రామానికి చెందిన రంజిత్ నాయుడు(52), వడమాలపేట మండలం SBRపురం(గుళూరు)కు చెందిన బాబురాజు అలియాస్ నరసింహరాజుగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.