News February 27, 2025
HYD వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం: సీఎం

HYDలోని మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ నూతన క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. HYD దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని, రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈవీ బయోటెక్ సహా తదితర రంగాల్లో హైదరాబాద్ అగ్రగామిగా ఉందన్నారు.
Similar News
News February 27, 2025
గ్రూప్-2 మెయిన్స్: అభ్యంతరాల గడువు పొడిగింపు

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలో ప్రశ్నలు, కీపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువును APPSC రేపటి వరకు పొడిగించింది. ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తామని, పోస్ట్, ఫోన్, SMS, వాట్సాప్ ద్వారా పంపితే పరిగణించబోమని స్పష్టం చేసింది. అనేక వివాదాలు, ఆందోళనల నడుమ ఈ నెల 23న జరిగిన పరీక్షకు 79,599 మంది హాజరైన విషయం తెలిసిందే. అదే రోజు ప్రాథమిక కీని కమిషన్ విడుదల చేసింది.
వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/
News February 27, 2025
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్

కరీంనగర్ ముకరంపూర్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ స్టేషన్‌లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యూ లైన్‌లో వెళ్లి గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తన గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News February 27, 2025
సిరిసిల్ల: పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 363,364 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాన్ని,183 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా సందర్శించారు. టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు తమ ఓట్లను వినియోగించుకునేందుకు బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరుగుతుంది.కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు.