News February 27, 2025
HYD: శివయ్యా.. కడుపు నింపావయ్యా..!

నిన్న మహా శివరాత్రిని పురస్కరించుకుని HYD శివనామస్మరణతో తరించింది. త్రేతాయుగంలో వానర సేన హనుమ, శ్రీ రాముడు ప్రతిష్ఠించిన కీసరలోని శివలింగం వద్ద అద్భుతం జరిగింది. భోళాశంకరుడికి భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని తిన్న వానరాలు.. వాటి కడుపునింపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ శివయ్యను మొక్కుతున్నట్లు ఉన్న ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వాటి సేనాని, ఆరాధ్య దైవం ప్రతిష్ఠించిన లింగం వద్ద సందడి చేశాయి.
Similar News
News February 27, 2025
దుబ్బరాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

సారంగాపూర్ మండలంలోని పెంబట్ల-కోనాపూర్ గ్రామంలో కొలువైన శ్రీదుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేకువజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడెమొక్కులు, కుంపటి గజాశూలం మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతరలో భక్తులకు సరైన సౌకర్యాలు లేవని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News February 27, 2025
కృష్ణా: ఇప్పటి వరకు 30.59% మేర ఓట్లు పోల్

కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 1 2గంటలకు 30.59% ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో మొత్తం 63,144 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు 19,306 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
News February 27, 2025
పీఎంతో సీఎం HYD అభివృద్ధిపై చర్చ!

ప్రధాని మోదీ భేటీలో HYD అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు.
☞ నగరంలో మెట్రో రైల్ ఫేజ్-IIకు అనుమతించాలి.
☞ మూసీ పునరుజ్జీవానికి కేంద్రం సాయం చేయాలి.
☞ RRRకు అనుమతులు, ఆమోదం ఇవ్వాలి.
☞ మూసీ, గోదావరి అనుసంధాననికి రూ.2వేల కోట్లు కావాలి.